Kannada actor Manjunath : వ్యభిచారి గృహం నిర్వహిస్తున్న కన్నడ హీరో అరెస్ట్..
కన్నడ హీరో మంజునాథ్ అలియాస్ సంజు వ్యభిచారం చేస్తూ సమాజానికి విలన్‌గా మారాడు. మూడేళ్ల క్రితం విడుదలైన 'న్యూరాన్' అనే సైక్లాజికల్ త్రిల్లర్ మూవీలో మంజునాథ్ కథానాయకుడిగా నటించాడు. ప్రస్తుతం ఈ నటుడు అనేక బిజినెస్ లు చేస్తూ కర్ణాటకలో పెద్ద మనిషిలా చలామణి అవుతున్నాడు. కాగా..

Kannada hero arrested for running brothel house
Kannada actor Manjunath : కన్నడ హీరో మంజునాథ్ అలియాస్ సంజు వ్యభిచారం చేస్తూ సమాజానికి విలన్‌గా మారాడు. మూడేళ్ల క్రితం విడుదలైన ‘న్యూరాన్’ అనే సైక్లాజికల్ త్రిల్లర్ మూవీలో మంజునాథ్ కథానాయకుడిగా నటించాడు. ప్రస్తుతం ఈ నటుడు అనేక బిజినెస్ లు చేస్తూ కర్ణాటకలో పెద్ద మనిషిలా చలామణి అవుతున్నాడు. కాగా సీసీబీ పోలీసులకు.. బంగ్లాదేశ్ నుంచి బెంగళూరుకి అక్రమంగా అమ్మాయిలను తీసుకు వచ్చి బలవంతపు వ్యభిచారం చేయిస్తున్నారు అంటూ సమాచారం వచ్చింది.
Kannada Movies : డిమాండ్ లో కన్నడ సినీ పరిశ్రమ.. హీరోలు, డైరెక్టర్లు ఎవ్వరూ తగ్గట్లేదు..
బెంగళూరు నగరంలోని కెంగేరి డెంటల్ కాలేజీ సమీపంలో ఒక అద్దె ఇంటిలో ఈ సంఘ వ్యతిరేక కార్యకలాపాలు సాగిస్తున్నట్లు తెలుసుకున్న పోలీసులు రెక్కీ నిర్వహించారు. నిన్న తెల్లవారుజామున 4 నుంచి 5.30 గంటల మధ్య సీసీబీ పోలీసులు దాడులు నిర్వహించి కెంగేరిలోని వినాయకనగర్, బాదరహళ్లి ప్రాంతాల్లో వ్యభిచారం నిర్వహిస్తున్న వారిని అదుపులోకి తీసుకున్నారు. ఈ దాడిలో మొత్తం ఐదుగురిని అరెస్టు చేసిన పోలీసులు.. నిందితులను విచారించగా మంజునాథ్ పేరు బయటకి వచ్చింది.
‘లోకాంటో’ అనే యాప్ ద్వారా వీరు హైటెక్ వ్యభిచారానికి పాల్పడుతున్నట్లు తెలియజేశారు పోలీసులు. పని ఇప్పిస్తాను అంటూ బంగ్లాదేశ్ నుంచి అమ్మాయిలను తీసుకు వచ్చి ఇక్కడ బలవంతంగా వ్యభిచారంలోకి దింపుతున్నట్లు వెల్లడించారు. ఇక ఈ దాడిలో నాలుగు మొబైల్ ఫోన్లు, బంగ్లాదేశ్ కరెన్సీ నోట్లు, భారతీయ నగదు లభించగా, వాటిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై కెంగేరి, బాదరహళ్లిలో కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను దర్యాప్తు చేస్తున్నారు.