Karate Kalyani : నా ఫోటోలు మార్ఫ్ చేసి వైరల్ చేస్తున్నారు.. పోలీసులకు కరాటే కళ్యాణి ఫిర్యాదు..
తాజాగా కరాటే కళ్యాణి మరోసారి వార్తల్లో నిలిచింది. హైదరాబాద్ షీ టీంని కలిసి తన ఫోటోలను పలువురు మార్ఫింగ్ చేసి వైరల్ చేస్తున్నారని కంప్లైంట్ ఇచ్చింది కళ్యాణి.

Karate Kalyani complaint to she team for promoting her morphing photos
Karate Kalyani : గత కొన్ని రోజులుగా కరాటే కళ్యాణి ఏదో ఒక విషయంలో వార్తల్లో నిలుస్తూనే ఉంది. ఇటీవల ఖమ్మంలో చేప్పట్టిన కృష్ణుడి రూపంలోని ఎన్టీఆర్ (NTR) విగ్రహాన్ని అడ్డుకుంటూ రచ్చ చేసి ఆ విగ్రహావిష్కరణను ఆపించేసింది. ఈ విషయంలో బహిరంగంగా వ్యాఖ్యలు, గొడవలు చేయడంతో పాటు, మూవీ ఆర్టిస్ట్ అసూసియేషన్ ఇచ్చిన నోటిస్ కూడా లెక్క చేయకపోవడంతో ఆమెను ‘మా'(MAA) నుంచి కూడా తొలగించారు.
ఆ తర్వాత నుంచి పలు ఇంటర్వ్యూలు ఇస్తూ సంచలన వ్యాఖ్యలు చేసి రెగ్యులర్ గా వార్తల్లో నిలుస్తుంది కరాటే కళ్యాణి. ఇటీవల తనను చంపడానికి కూడా ప్లాన్ చేశారని చెప్పింది. తాజాగా కరాటే కళ్యాణి మరోసారి వార్తల్లో నిలిచింది. హైదరాబాద్ షీ టీంని కలిసి తన ఫోటోలను పలువురు మార్ఫింగ్ చేసి వైరల్ చేస్తున్నారని కంప్లైంట్ ఇచ్చింది కళ్యాణి.
కళ్యాణి.. తన అసభ్యకరమైన ఫోటోలను వైరల్ చేస్తున్నారు. తన పాత సినిమాల్లోని ఫోటోలను మార్ఫింగ్ చేసి షేర్ చేస్తున్నారని, వైరల్ చేస్తున్నారని షీ టీమ్స్ కి ఫిర్యాదు చేసింది. లలిత్ కుమార్, ఓంకార్, రవీందర్ రెడ్డి, వేణుగోపాల్, దుర్గారావు, రాంబాబు, నితీష్, గుప్తా, నర్సింహా గౌడ్.. అనే పలువురు వ్యక్తులపై కేసు పెట్టింది. తనపై తప్పుడు ఆరోపణలు చేస్తూ పరువుకు భంగం కలిగిస్తున్నారని , తన ఎదుగుదల తట్టుకోలేకే ఇలా చేస్తున్నారని, నాపై దుష్ప్రచారం చేస్తున్నారని కళ్యాణి తన ఫిర్యాదులో పేర్కొంది. కళ్యాణి ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు షీ టీం పోలీసులు.