Katrina Kaif : తల్లి కాబోతున్న కత్రినా కైఫ్.. బేబీ బంప్ ఫోటో షేర్ చేస్తూ..

బాలీవుడ్ హీరోయిన్ కత్రినా కైఫ్ త్వరలో తల్లి కాబోతుంది. (Katrina Kaif)

Katrina Kaif : తల్లి కాబోతున్న కత్రినా కైఫ్.. బేబీ బంప్ ఫోటో షేర్ చేస్తూ..

Katrina Kaif

Updated On : September 23, 2025 / 1:43 PM IST

Katrina Kaif : ఒకప్పటి బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్ త్వరలో తల్లి కాబోతుంది. కత్రినా 2021లో బాలీవుడ్ హీరో విక్కీ కౌశల్ ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. పెళ్లి తర్వాత కత్రినా సినిమాలకు దూరంగా ఉంటుంది. గత కొన్ని రోజులుగా కత్రినా తల్లి కాబోతుంది అని వార్తలు వచ్చాయి. ఇటీవల ఓ ఈవెంట్లో కత్రినా బేబీ బంప్ తో ఉన్న ఫోటోలు లీక్ అవడంతో తాజాగా కత్రినా, విక్కీ కౌశల్ కలిసి అధికారికంగా ఈ వార్తని ప్రకటించారు.

విక్కీ కౌశల్, కత్రినా బేబీ బంప్ తో కలిసి ఉన్న ఫోటో షేర్ చేస్తూ.. మా జీవితంలో అద్భుతమైన అధ్యాయాన్ని ప్రారంభించబోతున్నాము అని తెలిపింది. దీంతో బాలీవుడ్ సెలబ్రిటీలు, సినీ ప్రముఖులు, ఫ్యాన్స్, నెటిజన్లు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

Also Read : OG Premieres: పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అలర్ట్.. ఓజీ ప్రీమియర్ షో టైమింగ్స్ లో మార్పులు

View this post on Instagram

A post shared by Katrina Kaif (@katrinakaif)