Katrina Kaif : అయ్యో.. కత్రినాకు ఏమైంది.. చేతికి బ్లాక్ ప్యాచ్ ఏంటి? హెల్త్ ఇష్యూనా? నెట్టింట ట్రెండింగ్.. వీడియో వైరల్..!
Katrina Kaif : గ్లామర్ డాల్ కత్రినా బ్లాక్ ప్యాచ్ ధరించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతున్నాయి. కొంతమంది నెటిజన్లు ఆమెకు డయాబెటిక్ అని అని అంటున్నారు.

Katrina Kaif raises health concerns as she gets spotted with a black patch in viral video
Katrina Kaif : నవరాత్రి 2024 వేడుకల వేళ ముంబై విమానాశ్రయంలో బాలీవుడ్ బ్యూటీ కత్రినా కైఫ్ సందడి చేసింది. అందమైన చీరకట్టుతో అభిమానులను ఆకట్టుకుంది. అయితే, ఆమె చేతికి ధరించిన బ్లాక్ గ్లూకోజ్ ప్యాచ్ ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షించింది. కత్రినా కైఫ్ అది ఎందుకు ధరించింది? నెట్టింట్లో ఇదే ప్రశ్న వ్యక్తమవుతోంది. కత్రినా బ్లాక్ ప్యాచ్ ధరించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతున్నాయి. కొంతమంది నెటిజన్లు ఆమెకు డయాబెటిక్ అని అని అంటున్నారు. మరొకరు అది “డయాబెటిక్స్ ప్యాచ్” అంటూ కామెంట్లు పెడుతున్నారు.
ఎయిర్‌పోర్టులో కత్రినాకైఫ్ గ్లామర్ కన్నా ఆమె చేతికి ధరించిన ప్యాచ్ ఫుల్ ట్రెండ్ అవుతోంది. నెటిజన్లు చాలా అందంగా ఉన్నావంటూ కత్రినాను పొగుడుతూ కామెంట్లు పెడుతుంటే.. మరికొందరు నెటిజన్లు మాత్రం ఆమె చేతికి ధరించిన నల్లటి ప్యాచ్ గురించి ఆందోళన చెందుతున్నారు. అసలు కత్రినాకు ఏమైంది? ఏదైనా అనారోగ్య సమస్య వచ్చిందా? ఏంటి అని తెగ చర్చించుకుంటున్నారు.
నివేదిక ప్రకారం.. కత్రినా చేతిపై బ్లాక్ పాచ్ రక్తంలో బ్లడ్ షుగర్ లెవల్స్ మానిటరింగ్ చేసే డయాబెటిస్ ప్యాచ్ కావచ్చు. సాధారణంగా మధుమేహం ఉన్న వ్యక్తులే ఇలాంటి ప్యాచ్ ధరిస్తారని అంటున్నారు. వాస్తవానికి, కత్రినాకు డయాబెటిస్ ఉందని అధికారిక నిర్ధారణ లేదు. కానీ, కొంతమంది అభిమానులు మాత్రం అది కేవలం ఫిట్‌నెస్ ట్రాకర్ అంటున్నారు.
ఎందుకంటే.. ఫిట్‌నెస్ విషయంలో కత్రినా చాలా కచ్చితంగా ఉంటారని అంచనా వేస్తున్నారు. కత్రినా బ్లాక్ ప్యాచ్ గురించి జోరుగా చర్చ జరుగుతున్నప్పటికీ.. ఆమెలో ఎలాంటి హెల్త్ ఇష్యూలు ఉన్నట్టుగా కనిపించడం లేదు. ఎంతో ఉత్సాహంగా కనిపించింది. అభిమానులకు అభివాదం చేస్తూ ఫొటోలకు ఫొజులిచ్చింది. అయితే, బ్లాక్ ప్చాచ్ పక్కన పెడితే.. కత్రిన చీర, ఆమె జువెలరీ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా మారాయి.
View this post on Instagram
ఇటీవలే విక్కీ కౌశల్ భార్య కత్రినా కైఫ్ గర్భం గురించి మీడియా నివేదికల్లో ఊహాగానాలంటూ కొట్టిపారేశాడు. అలాంటి శుభవార్త ఉంటే సంతోషంగా ప్రకటిస్తామని చెప్పాడు. ఈ సినిమా ప్రమోషన్ కోసం కౌశల్ నగరానికి వచ్చారు. ఈ మూవీలో ట్రిప్టి డిమ్రీ, అమీ విర్క్ కూడా నటించారు. కత్రినా చివరిగా సల్మాన్‌ఖాన్‌తో టైగర్ 3లో నటించింది. ఐఎస్ఐ ఏజెంట్ జోయాగా పాత్రలో మెప్పించింది.
Read Also : Divya Bharathi : హాట్ ఫోజులతో తమిళ భామ దివ్యభారతి..