Kaulas Kota : కౌలాస్ కోట పోస్టర్ లాంచ్.. త్వరలోనే షూటింగ్..
తాజాగా ఈ సినిమా పోస్టర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించారు.

Kaulas Kota Movie Poster Launched
Kaulas Kota : అద్వైత్ క్రియేషన్స్ బ్యానర్‌పై మన ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ 24 క్రాఫ్ట్స్ సమర్పణలో మాదాల నాగూర్ నిర్మాణంలో పీఎస్పీ శర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘కౌలాస్ కోట’. తాజాగా ఈ సినిమా పోస్టర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించారు.
ఈ ఈవెంట్లో నిర్మాత డాక్టర్ మాదాల నాగూర్ మాట్లాడుతూ.. డైరెక్టర్ పీఎస్పీ శర్మ గారితో కలిసి పనిచేయడం గౌరవంగా భావిస్తున్నాను. రియల్ కోట ప్రాంగణంలోనే షూటింగ్ త్వరలో ప్రారంభం అవుతుంది అని తెలిపారు.
దర్శకుడు పీఎస్పీ శర్మ మాట్లాడుతూ.. స్టోరీ, స్క్రీన్‌ప్లే విషయంలో చాలా కష్టపడ్డాం. రచయిత ఎర్రా సంజీవరాజ్ ఈ కథను ప్రారంభించినప్పటి నుంచి ఎన్నో అంశాలపై పరిశీలన చేసి, కథా మాటలు అందించారు. ఈ సినిమాలో గ్రాంథికతతో పాటు ప్రస్తుత పరిస్థితులకు తగ్గట్టు సన్నివేశాలు ఉంటాయి అని తెలిపారు.