Papa : ‘పాపా’ మూవీ రివ్యూ..
తమిళ సినిమా ‘దాదా’ ఇటీవల తెలుగులో ‘పాపా’ అనే టైటిల్ తో రిలీజ్ అయింది.

Kavin Aparna Das Papa Movie Review
Papa Movie Review : కవిన్, అపర్ణా దాస్ జంటగా తెరకెక్కిన తమిళ సినిమా ‘దాదా’. 2023 లో తమిళ్ లో చిన్న సినిమాగా రిలీజయి పెద్ద హిట్ అయింది. భాగ్యరాజ్, ఐశ్వర్య భాస్కరన్, విటివి గణేష్.. పలువురు ముఖ్య పాత్రల్లో గణేష్ కె. బాబు దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. ఈ సినిమా ఇటీవల తెలుగులో ‘పాపా’ అనే టైటిల్ తో రిలీజ్ అయింది. జేకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నిర్మాత నీరజ కోట తెలుగులో ఈ సినిమాని రిలీజ్ చేసారు.
కథ విషయానికొస్తే.. మణి (కవిన్), సింధు (అపర్ణ దాస్) ఇద్దరు కాలేజ్ టైమ్ లో ప్రేమించుకుంటారు. పెళ్ళికి ముందే శృంగారం చేయడంతో ఇంజనీరింగ్ చదువుతున్నప్పుడే సింధు ప్రగ్నెంట్ అవుతుంది. దాంతో సింధు, మణి ఇద్దర్నీ వాళ్ల పేరెంట్స్ ఇంట్లోంచి వెళ్ళగొడతారు. దీంతో ఈ ఇద్దరూ కలిసి కొత్తగా లైఫ్ స్టార్ట్ చేస్తారు. ఈ ఇద్దరూ ఒకపక్క చదువు, మరోపక్క ప్రగ్నెన్సీ, వైవాహిక జీవితం ఎలా మెయింటైన్ చేస్తారు? ఇద్దరికీ విబేధాలు వస్తే ఏం జరిగింది? ఇద్దరూ కలిసీ ఉన్నారా? బాబు పుట్టిన తర్వాత వీరిద్దరి లైఫ్ ఎలా మారింది తెలియాలంటే తెరపై చూడాల్సిందే.
Also Read : Jabardasth : జబర్దస్త్ లో కొత్త యాంకర్.. ఈసారి అబ్బాయి.. వార్నింగ్ ఇచ్చిన రష్మీ.. ప్రోమో వైరల్..
సినిమా విశ్లేషణ.. తమిళ్ లో ఆల్రెడీ ఈ సినిమా హిట్ అవ్వడం, ఓటీటీలోకి అందుబాటులోకి రావడంతో ఈ సినిమా తెలుగు ప్రేక్షకులకు కూడా బాగానే కనెక్ట్ అయింది. ఇన్ని రోజుల తర్వాత తెలుగులో రిలీజ్ చేయడం ఆసక్తికర విషయం. ఈ సినిమా గతంలో ఉదయ్ కిరణ్ – రీమాసేన్ చిత్రం సినిమాను గుర్తుచేస్తుంది. లవ్ స్టోరీ రెగ్యులర్ గా ఉన్నా ప్రేమలో విబేధాలు వచ్చిన తర్వాత నుంచి ఆసక్తిగా సాగుతుంది కథ. హీరో హీరోయిన్స్ మధ్య గొడవలు రొటీన్ సీన్స్ లా అనిపిస్తాయి. సింగిల్ ఫాదర్ గా కష్టాలు, తన కొడుకు కోసం హీరో పడే తపన.. ఆ సీన్స్ అన్ని హృదయాన్ని తాకుతాయి. మళ్ళీ హీరో – హీరోయిన్స్ కలిసే సీన్స్ కూడా ఎమోషనల్ గా మెప్పిస్తాయి. పాపా చూసిన తర్వాత ఒక మంచి ఫీల్ గుడ్ సినిమా చూసాం అనిపిస్తుంది.
నటీనటుల పర్ఫార్మెన్స్.. తమిళ్ నటుడు కవిన్ ఇటీవల పలు సినిమాలతో మంచి పేరు తెచ్చుకుంటున్నాడు. కవిన్ ఈ సినిమాలో అద్భుతంగా నటించాడు. ఒక చిన్న బాబుని పట్టుకొని తండ్రి పాత్రలో మెప్పిస్తాడు. అపర్ణదాస్ కూడా తన నటనతో అలరిస్తుంది. విటివి గణేష్ కామెడీ బాగానే వర్కౌట్ అయింది. మిగిలిన నటీనటులు వారి పాత్రల్లో మెప్పించారు.
Also Read : Express Hari – Ashu Reddy : షోలో అషురెడ్డి కాలు పట్టుకున్న ఎక్స్‌ప్రెస్ హరి.. ఏం చేసాడంటే.. ప్రోమో వైరల్..
సాంకేతిక విశ్లేషణ.. సినిమాటోగ్రఫీ విజువల్స్ బాగున్నాయి. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం చాలా బాగా ఇచ్చారు. సాంగ్స్ యావరేజ్. తెలుగు డబ్బింగ్ బాగా కుదిరింది. ఎడిటింగ్ పరంగా కొన్ని సీన్స్ కట్ చేస్తే బాగుండు అనిపిస్తుంది. ఒక పాత కథను కాస్త ఎమోషనల్ టచ్ ఇచ్చి కొత్తగా చెప్పే ప్రయత్నం చేసాడు దర్శకుడు. నిర్మాణ పరంగా కూడా ఈ సినిమాకు బాగానే ఖర్చుపెట్టారు.
మొత్తంగా ‘పాపా’ సినిమా ఒక మంచి ఫీల్ గుడ్ మూవీ. ఈ సినిమాకు 3 రేటింగ్ ఇవ్వొచ్చు.
గమనిక : ఈ సినిమా రివ్యూ & రేటింగ్ కేవలం విశ్లేషకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.