RRR: కీరవాణి, చంద్రబోస్‌లకు ఆస్కార్ స్పెషల్ ఇన్విటేషన్..!
దర్శకధీరుడు ఎస్ఎస్.రాజమౌళి తెరకెక్కించిన ‘ఆర్ఆర్ఆర్’ ఎలాంటి చరిత్ర సృష్టించిందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఈ సినిమా ఇండియన్ బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపించి, తెలుగు సినిమా సత్తాను మరోసారి చాటింది. ఇక ఈ సినిమా దేశవ్యాప్తంగా అనేక అవార్డులు, రివార్డులను అందుకుంది. అంతేగాక, ఆర్ఆర్ఆర్ సినిమా ఆస్కార్ బరిలో బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో నామినేట్ అయ్యి చరిత్ర సృష్టించింది.

Keeravani Chandrabose From RRR Gets Oscar Special Invitation
RRR: దర్శకధీరుడు ఎస్ఎస్.రాజమౌళి తెరకెక్కించిన ‘ఆర్ఆర్ఆర్’ ఎలాంటి చరిత్ర సృష్టించిందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఈ సినిమా ఇండియన్ బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపించి, తెలుగు సినిమా సత్తాను మరోసారి చాటింది. ఇక ఈ సినిమా దేశవ్యాప్తంగా అనేక అవార్డులు, రివార్డులను అందుకుంది. అంతేగాక, ఆర్ఆర్ఆర్ సినిమా ఆస్కార్ బరిలో బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో నామినేట్ అయ్యి చరిత్ర సృష్టించింది.
RRR : RRR ఖాతాలో మరో అంతర్జాతీయ అవార్డు..
ఇలా ఓ తెలుగు సినిమా ఆస్కార్ బరిలో నామినేట్ కావడంతో ఆర్ఆర్ఆర్ సినిమా ఖచ్చితంగా విజయం సాధిస్తుందని అందరూ భావిస్తున్నారు. ఇక ఆస్కార్ అవార్డుల ప్రధానోత్సవం మార్చి 12న జరగనుండటంతో అందరూ కూడా ఆ రోజు కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇదిలా ఉండగా, తాజాగా ఆర్ఆర్ఆర్ టీమ్ నుండి ఎంఎం.కీరవాణి, చంద్రబోస్‌లకు ఆస్కార్ కమిటీ ప్రత్యేక ఆహ్వానం పంపించింది. ‘నాటు నాటు’ సాంగ్‌కు సాహిత్యం, మ్యూజిక్ అందించిన చంద్రబోస్, కీరవాణిలకు ఈ మేరకు ఇన్విటేషన్ పంపారు.
RRR : సరికొత్త చరిత్ర సృష్టించిన RRR..
ఆస్కార్ అవార్డులకు నామినేట్ అయిన సినిమాలకు సంబంధించిన నామినీస్ అందర్నీ ఆస్కార్ కమిటీ ఓ ప్రత్యేక లంచ్‌కు ఆహ్వానిస్తుంది. ఇక ఈ లంచ్‌లో పాల్గొనేందుకు చంద్రబోస్ ఫిబ్రవరి 10 రాత్రి అమెరికాకు బయల్దేరనున్నారు. కీరవాణి మాత్రం మరో రెండు రోజుల తరువాత అమెరికాకు పయనం కానున్నట్లు తెలుస్తోంది. మార్చి 12న జరగబోయే ఆస్కార్ వేడుక కోసం ఇప్పటికే రాజమౌళి, కీరవాణి, చంద్రబోస్ సహా ట్రిపుల్ ఆర్ టీంలో పలువురికి ఆహ్వానం అందినట్టు తెలుస్తోంది.