keerthi Suresh : మహేష్ ఫ్యాన్స్‌ని భయపెడుతున్న ‘మహానటి’..

రెండు, మూడు ఫ్లాపులు వస్తే ‘ఐరన్ లెగ్’ అని.. వరుసగా మూడు హిట్లు పడితే ‘గోల్డెన్ లెగ్’ అనే ఇండస్ట్రీలో ఏకంగా డబుల్ హ్యాట్రిక్ దాటేసి మరీ ఫ్లాప్స్ కొట్టిన కీర్తిని ఏమంటారు?..

keerthi Suresh : మహేష్ ఫ్యాన్స్‌ని భయపెడుతున్న ‘మహానటి’..

Keerthi Suresh

Updated On : January 30, 2022 / 9:15 PM IST

keerthi Suresh: కీర్తి సురేష్.. ‘మహానటి’ గా మెప్పించి, సావిత్రి క్యారెక్టర్‌లో జీవించేసి.. తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. తమిళ్‌లోనూ క్రేజ్ తెచ్చుకుంది. కీర్తి పర్ఫార్మెన్స్‌కి నేషనల్ అవార్డ్ నడిచొచ్చింది. బాక్సాఫీస్ బరిలో ‘మహానటి’ క్రియేట్ చేసిన సెన్సేషన్ అంతా ఇంతా కాదు.

Bhola Shankar : కీర్తి సురేష్ భర్తగా!

‘మహానటి’ అంటే సావిత్రి.. ‘మహానటి’ లో ఆ లెజెండరీ యాక్ట్రెస్ రోల్‌లో మెప్పించింది ఎవరంటే కీర్తి సురేష్ అనేంతగా ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. తర్వాత ఆమె కోసం లేడీ ఓరియంటెడ్ కథలు పుట్టుకొచ్చాయి. తనను కేవలం లేడీ ఓరియంటెడ్ సినిమాలకే పరిమితం చెయ్యొద్దని, స్టార్ హీరోల పక్కన హీరోయిన్‌గానూ చేస్తానని చెప్పింది. అన్నట్లే స్టార్ హీరోల సినిమాల్లో ఆఫర్స్ అందుకుంది.

Mahanati

 

కట్ చేస్తే.. హీరోయిన్‌గా ఒక్కటంటే ఒక్క హిట్ తన ఖాతాలో వేసుకోలేక పోయింది. చియాన్ విక్రమ్ పక్కన చేసిన ‘సామి’ సీక్వెల్ ‘సామి 2’ తమిళ్‌తో పాటు తెలుగులోనూ డిజాస్టర్ అయింది. ‘పందెంకోడి 2’, లేడీ ఓరియంటెడ్ మూవీస్ ‘పెంగ్విన్’, ‘మిస్ ఇండియా’ కూడా ఫ్లాప్.. ‘రంగ్ దే’, సూపర్ స్టార్ రజినీకాంత్ చెల్లెలిగా చేసిన ‘అన్నాత్తే’ (పెద్దన్న), ది కంప్లీట్ యాక్టర్ మోహన్ లాన్ ‘మరక్కార్: అరేబియా సముద్ర సింహం’, రీసెంట్‌గా ‘గుడ్ లక్ సఖి’.. ఇలా వరుసగా 8 ఫ్లాపులు పడ్డాయి.

Keerthy Suresh Marriage : పెళ్లి వార్త‌ల‌పై కీర్తి సురేష్‌ క్లారిటీ

రెండు, మూడు ఫ్లాపులు వస్తే ‘ఐరన్ లెగ్’ అని.. వరుసగా మూడు హిట్లు పడితే ‘గోల్డెన్ లెగ్’ అనే ఇండస్ట్రీలో ఏకంగా డబుల్ హ్యాట్రిక్ దాటేసి మరీ ఫ్లాప్స్ కొట్టిన కీర్తిని ఏమంటారు? అందుకే కీర్తి సురేష్, మహేష్ బాబుతో నటిస్తున్న ‘సర్కారు వారి పాట’ రిజల్ట్ విషయంలో సూపర్ స్టార్ ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారు.

Keerthy Suresh : ఎమ్మెల్యే పక్కన హీరోయిన్ గా చేయబోతున్న కీర్తి సురేష్