Adah Sharma : నేను బాగానే ఉన్నా.. ప్రమాదంలో స్వల్ప గాయాలు.. అదా శర్మ ట్వీట్!

ముంబైలో కేరళ స్టోరీ దర్శకుడుతో పాటు అదా శర్మ రోడ్డు ప్రమాదానికి గురైంది. అయితే ఈ ప్రమాదం గురించి అదా ట్వీట్ చేసింది.

Adah Sharma : నేను బాగానే ఉన్నా.. ప్రమాదంలో స్వల్ప గాయాలు.. అదా శర్మ ట్వీట్!

Kerala Story star Adah Sharma tweet on her accident at mumbai

Updated On : May 14, 2023 / 10:00 PM IST

Adah Sharma Accident : గత కొంత కాలంగా సరైన హిట్ కోసం ఎదురు చూస్తున్న హీరోయిన్ అదా శర్మకు.. ది కేరళ స్టోరీ (The Kerala Story) సినిమాతో బ్లాక్ బస్టర్ విజయం అందింది. ఈ మూవీ రిలీజ్ కి ముందు ఎన్నో వివాదాలను ఎదురుకుంది. సినిమా విడుదల కోసం కోర్ట్ మెట్టులు కూడా ఎక్కింది చిత్ర యూనిట్. ప్రధాని మోదీ కూడా ఈ సినిమా గురించి ప్రస్తావిస్తూ ఆడియన్స్ ని చూడాలనే సందేహం ఇన్‌డైరెక్ట్ గా ఇచ్చారు. కోర్ట్ ఆర్డర్, మోదీ మాట సహాయం ఉన్న కొన్ని చోట్ల ఈ సినిమాని రిలీజ్ చేయడానికి థియేటర్ ఓనర్స్ బయపడి షోలను నిలిపివేశారు.

The Kerala Story : ఇండియాలో 50 కోట్లు కొల్లగొట్టిన ది కేరళ స్టోరీ.. ఇప్పుడు ఏకంగా 37 దేశాల్లో విడుదల..

ఇక చాలా తక్కువ థియేటర్ థియేటర్స్ లోనే రిలీజ్ అయిన ఈ చిత్రం మౌత్ టాక్ తో జనాలని థియేటర్స్ కి రప్పించింది. దీంతో కేవలం 9 రోజుల్లోనే 112.87 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ అందుకొని 100 కోట్ల క్లబ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇది ఇలా ఉంటే, తాజాగా ఈ మూవీ దర్శకుడు సుదీప్తో సేన్‌, హీరోయిన్ అదా శర్మ రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ యాక్సిడెంట్ లో ఇద్దరికీ గాయాలు అవ్వడంతో వెంటనే హాస్పిటల్ కి తరలించారు. అయితే ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో.. అదాకి ఏమైందో అని స్నేహితులు, అభిమానులు అందరకు ఆమెకు మెసేజ్లు పెడుతున్నారు.

The Kerala Story : ది కేరళ స్టోరీ ఏ ఓటీటీలో ప్రసారం కానుంది తెలుసా?

దీంతో అదా శర్మ సోషల్ మీడియా ద్వారా ప్రస్తుత తన పరిస్థితి తెలియజేసింది. “యాక్సిడెంట్ వార్త తెలియడంతో అందరూ కంగారు పడుతున్నారు. దీంతో నాకు ఎన్నో మెసేజ్స్ వస్తున్నాయి. సీరియస్ ఏమి లేదు. స్వల్పంగా గాయపడ్డాం అంతే. నేను, మా మూవీ టీం మొత్తం బాగానే ఉన్నాము” అంటూ ట్వీట్ చేసింది. కాగా నేడు సాయంత్రం సుదీప్తో సేన్‌, అదా శర్మ కరీంనగర్‌లో జరిగే హిందూ ఏక్తాయాత్రకు హాజరు కావాల్సి ఉంది. ప్రమాదం జరగడంతో.. ఆ కార్యక్రమానికి రాలేకపోతున్నాము అంటూ సుదీప్తో సేన్‌ కూడా ట్విట్టర్ ద్వారా తెలియజేశాడు.