Yash : శ్రీలంకలో ల్యాండ్ అయిన రాకీ భాయ్.. ఎందుకో తెలుసా?

కేజీఎఫ్ వంటి సక్సెస్ తరువాత యశ్ గీతు మోహన్ దాస్ అనే ఒక మలయాళ దర్శకురాలి దర్శకత్వంలో ఒక సినిమా చేయడానికి సిద్దమవుతున్నాడట. ఈ క్రమంలోనే తాజాగా శ్రీలంక వెళ్లినట్లు తెలుస్తుంది.

Yash : శ్రీలంకలో ల్యాండ్ అయిన రాకీ భాయ్.. ఎందుకో తెలుసా?

KGF hero Yash is in srilanka for his upcoming project

Updated On : April 16, 2023 / 12:12 PM IST

Yash : కేజీఎఫ్ (KGF) హీరో యశ్ తదుపరి సినిమా కోసం ఆడియన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. కేజీఎఫ్ 2 తరువాత ఈ హీరో ఇప్పటి వరకు మరో సినిమా ఓకే చేయలేదు. ఇటీవలే కేజీఎఫ్ 2 రిలీజ్ అయ్యి ఏడాది కూడా పూర్తి చేసుకుంది. తాజాగా యశ్ నెక్స్ట్ ప్రాజెక్ట్ గురించి ఇంటరెస్టింగ్ న్యూస్ ఒకటి బయటకి వచ్చింది. మొదటి సినిమాతోనే నేషనల్ అవార్డు అందుకున్న గీతు మోహన్ దాస్ (Geetu Mohandas) తో యశ్ తన సినిమా చేయబోతున్నాడని గట్టిగా వార్తలు వినిపిస్తున్నాయి. గత కొంత కాలంగా ఈ సినిమా కథ పై యశ్ కూడా వర్క్ చేస్తున్నట్లు సమాచారం.

KGF 3 : చరిత్ర సృష్టించిన KGF 2కు వన్ ఇయర్.. పార్ట్ 3పై అప్డేట్ ఇచ్చిన హోంబలె ఫిలిమ్స్..

ఈ సినిమాని త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారు. ఇది ఇలా ఉంటే, తాజాగా యశ్ శ్రీలంక వెళ్ళాడు. అక్కడ ఎలా నేషనల్ పార్క్ (Yala National Park) ని సందర్శించాడు. ఇక అక్కడి శ్రీలంకన్స్ తో కలిసి దిగిన ఫోటోలో నెట్టింట వైరల్ అవుతున్నాయి. కాగా యశ్, గీతు మోహన్ దాస్ సినిమా విషయం పైనే శ్రీలంక వెళ్లాడని గుసగుసలు వినిపిస్తున్నాయి. మరి యశ్ ఈ సినిమా గురించి వెళ్లాడా? లేదా వెకేషన్ కి వెళ్లాడా? అనేది తెలియాల్సి ఉంది.

కాగా కేజీఎఫ్ వంటి సక్సెస్ తరువాత కేవలం రెండు సినిమాల అనుభవం ఉన్న ఒక దర్శకురాలికి యశ్ అవకాశం ఇవ్వనున్నాడు అన్న విషయం అందర్నీ ఆశ్చర్య పరుస్తుంది. అయితే మొదటి నుంచి కథలకు ప్రాధాన్యత ఇస్తూ రిస్క్ లు తీసుకోని సక్సెస్ లు అందుకున్నాడు. అలాగే ఈ కథ కూడా చాలా ఛాలెంజింగ్ అనిపించడంతో ఓకే చెప్పినట్లు సమాచారం. ఇక ఈ ప్రాజెక్ట్ గురించి ఒక క్లారిటీ రావాలి అంటే ఇంకొన్ని రోజులు ఎదురు చూడాల్సిందే.