Yash : మలేషియాలో రాకీ భాయ్ గోల్డ్ స్టోర్.. బాడీగార్డ్స్, భారీ కాన్వాయితో కేజీఎఫ్3 రేంజ్ ఎంట్రీ..
మలేషియాలో గోల్డ్ స్టోర్ ఓపెన్ చేయడానికి వెళ్లిన రాకీ భాయ్. 10 మందికి పైగా బాడీగార్డ్స్, కాస్టలీ కారులతో భారీ కాన్వాయితో యశ్ ని ఎయిర్ పోర్ట్ నుంచి హోటల్ కి కేజీఎఫ్3 రేంజ్ లో తీసుకోని వెళ్లారు.

KGF star Yash grand entry into malaysia video viral in social media
Yash : కన్నడ రాకింగ్ స్టార్ యశ్ కేజీఎఫ్ (KGF) చిత్రాలతో భారీ స్టార్ డమ్ ని సంపాదించుకున్నాడు. KGF2 రిలీజ్ అయ్యి ఏడాది అయ్యినా ఇప్పటివరకు మరో సినిమా ప్రకటించలేదు. ఈ హీరో నుంచి నెక్స్ట్ సినిమా కోసం అభిమానులతో పాటు పాన్ ఇండియా ఆడియన్స్ కూడా ఎంతో ఆశక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇది ఇలా ఉంటే, తాజాగా ఈ హీరో మలేషియా వెళ్ళాడు. కేజీఎఫ్ లో బంగారంతో వ్యాపారం చేసిన రాకీ భాయ్.. మలేషియాలో ఒక బంగారు షాప్ ఓపెనింగ్ చేయడానికి వెళ్ళాడు.
ఇక అక్కడికి చేరుకున్న యశ్ కి ఆ గోల్డ్ స్టోర్ ప్రతినిధులు కేజీఎఫ్3 రేంజ్ లో ఎంట్రీ పలికారు. 10 మందికి పైగా బాడీగార్డ్స్, కాస్టలీ కారులతో భారీ కాన్వాయితో యశ్ ని ఎయిర్ పోర్ట్ నుంచి హోటల్ కి తీసుకోని వెళ్లారు. ఈ మొత్తాన్ని ఒక సినిమా రేంజ్ లో షూట్ చేసి షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. ఆ వీడియో చూసి అభిమానులు, నెటిజెన్లు ఫిదా అవుతున్నారు. ఒక హై బడ్జెట్ సినిమాలో హీరో ఎంట్రీ కూడా ఈ రేంజ్ ఉండదు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఒకవేళ ఆ వీడియో చూడకపోతే ఇప్పుడే చూసేయండి.
Arrival Of #Monster ??
This Video Not less than Any Movie Introduction Scene ?” Malaysia Welcomes YASHBOSS “#YashBOSS #Yash19 @TheNameIsYash pic.twitter.com/UDadvTFlLj
— Yash Trends ™ (@YashTrends) July 8, 2023
అలాగే మలేషియాలోని యశ్ అభిమానులు కూడా తనని చూసేందుకు ఆ ఈవెంట్ దగ్గరికి భారీ ఎత్తున చేరుకున్నారు. మలేషియాలో యశ్ ఫాలోయింగ్ చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఇక యశ్ నెక్స్ట్ ప్రాజెక్ట్ గురించి అక్కడి అభిమానులు ప్రశ్నించగా, యశ్ బదులిస్తూ.. “ఒక ప్రాజెక్ట్ మీద ఆల్రెడీ పని చేస్తున్నాను. త్వరలోనే అనౌన్స్ చేస్తాను అప్పటి వరకు కొంచెం ఓపిక పట్టండి” అంటూ చెప్పుకొచ్చాడు. దీంతో త్వరలోనే యశ్ తదుపరి సినిమా పై ప్రకటన రానున్నట్లు తెలుస్తుంది.