Khaidi : కార్తీ ‘ఖైదీ’ రీరిలీజ్.. ఎప్పుడో తెలుసా..?
తమిళ స్టార్ హీరో సూర్య తమ్ముడిగా సినిమాల్లో అడుగుపెట్టిన తన కంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు హీరో కార్తీ.

Khaidi rerelease on may 25th in HYD
Khaidi rerelease : తమిళ స్టార్ హీరో సూర్య తమ్ముడిగా సినిమాల్లో అడుగుపెట్టిన తన కంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు హీరో కార్తీ. తమిళంతో పాటు తెలుగులోనూ అభిమానులను సంపాదించుకున్నాడు. మే 25న ఆయన పుట్టిన రోజు అన్న సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆరోజున లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో కార్తీ నటించిన చిత్రాన్ని ఖైదీ చిత్రాన్ని హైదరాబాద్‌లో రిరీలీజ్ చేయనున్నారు. ఇందుకు సంబంధించిన పోస్టర్ ను విడుదల చేశారు.
డ్రీమ్ వారియర్ పిక్చర్స్ పతాకంపై ఎస్.ఆర్.ప్రకాష్‌బాబు, ఎస్.ఆర్.ప్రభు, తిరుప్పూర్ వివేక్ నిర్మించిన యాక్షన్ థ్రిల్లర్ ‘ఖైదీ’. 2019 అక్టోబర్ 25న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను అలరించింది. బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపించింది. ఖైదీగా కార్తీ నటన అదుర్స్ అనిపించేలా ఉంది. ఇక ఈ చిత్రానికి సీక్వెల్ ఉంటుందని ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే.
Love Me Trailer : ‘లవ్ మీ’ ట్రైలర్ వచ్చేసింది.. అందర్నీ చంపేసే దయ్యంతో హీరో ప్రేమ..
కథ విషయానికి వస్తే : జైల్లో కఠిన కారాగార శిక్ష అనుభవిస్తున్న ‘ఢిల్లీ’ అనే ఖైదీ తన జీవితంలో మొదటిసారి తన కూతురుని చూడటానికి ఎన్నో ఏళ్ల నిరీక్షణ తర్వాత అనుమతి వస్తోంది. ఎంతో ఆశతో జైలు నుండి బయటకు వస్తాడు. కూతురిని కలవడానికి వెళ్తుండగా మధ్యలో అనుకోకుండా అతనికి పోలీసుల ప్రాణాలనే కాపాడాల్సిన పరిస్థితి వస్తోంది.
మొదట్లో అతను అంగీకరించకపోయినా చివరికి కూతురు భవిష్యత్తు కోసం ఆ పనికి పూనుకుంటాడు. అసలు పోలీసులకు ‘ఢిల్లీ’ సహాయం తీసుకునే పరిస్థితులు ఎందుకు వచ్చాయి..‘ఢిల్లీ’ వాళ్ళను సేవ్ చేశాడా ? సేవ్ చేసే క్రమంలో ఎలాంటి సంఘటనలు, అవరోధాలు ఎదుర్కొన్నాడు అనేది సినిమా చూసి తెలుసుకోవాలి.
On the Occasion of @Karthi_offl Bday #Khaidi back in theatres from May25th (Hyderabad) ?@Dir_Lokesh @prabhu_sr pic.twitter.com/e19kSm4kDd
— Teju PRO (@Teju_PRO) May 16, 2024