Koffee With Karan : మీ అమ్మ నిన్నింకా వర్జిన్ అనుకుంటుందా.. పర్సనల్ ప్రశ్నలతో రెచ్చిపోయిన కరణ్.. ఇబ్బందిపడిన హీరోయిన్..
కాఫీ విత్ కరణ్ షోకి వచ్చిన షాహిద్ కపూర్, కియారా అద్వానీని పలు ప్రశ్నలు అడిగాడు కరణ్. కియారాని ఉద్దేశించి నువ్వు బెడ్‌రూమ్‌లో దొంగా పోలీసు లాంటి ఆటలు ఆడలేదా? అని అడిగాడు. దీనికి కియారా కొంత ఇబ్బందిగా ఈ ఎపిసోడ్ మా అమ్మ కూడా చూస్తుంది..................

Kiara Advani gets embarrassed for Karan Johar's questions
Koffee With Karan : బాలీవుడ్ సూపర్ హిట్ షో కాఫీ విత్ కరణ్ ఏడో సీజన్ ఇటీవలే మొదలైంది. తాజా ఎపిసోడ్ లో షాహిద్ కపూర్, కియారా అద్వానీ గెస్టులుగా వచ్చారు. ఈ ఎపిసోడ్ ప్రోమోలోనే కియారా రిలేషన్ గురించి అడిగేశాడు కరణ్. సాధారణంగా కరణ్ తన షోలో పర్సనల్ క్వశన్స్, సెక్స్ లైఫ్ మీద కూడా ప్రశ్నలు వేస్తాడు. కొన్ని సార్లు అవతలి వాళ్ళకి ఇబ్బందిగా ఉన్నా కరణ్ అదేమీ పట్టించుకోడు. ప్రతి ఎపిసోడ్ లోనూ ఈ ప్రశ్నలు కచ్చితంగా అడుగుతాడు. తాజాగా ఈ ఎపిసోడ్ రిలీజ్ అవ్వగా ఇందులో చాలా పర్సనల్ ప్రశ్నలే అడిగినట్టు తెలుస్తుంది.
కాఫీ విత్ కరణ్ షోకి వచ్చిన షాహిద్ కపూర్, కియారా అద్వానీని పలు ప్రశ్నలు అడిగాడు కరణ్. కియారాని ఉద్దేశించి నువ్వు బెడ్‌రూమ్‌లో దొంగా పోలీసు లాంటి ఆటలు ఆడలేదా? అని అడిగాడు కరణ్. దీనికి కియారా కొంత ఇబ్బందిగా ఈ ఎపిసోడ్ మా అమ్మ కూడా చూస్తుంది అని చెప్పింది. అయినా కరణ్ ఆగకుండా.. అయితే ఏంటి? మీ అమ్మ నువ్వింకా వర్జిన్ అనుకుంటుందా ఏంటి అని డైరెక్ట్‌గా అడిగేశాడు. దీనికి కియారా ఏం చెప్పాలో తెలియక నాకు తెలిసినంతవరకు అవుననే అనుకుంటున్నాను అని చెప్పింది. ఇలాంటి ప్రశ్నలు అడిగి కియారాని బ్బంది పెట్టడంతో మరోసారి కరణ్ ని ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు.
Director Shankar : చరణ్ సినిమా ఆపలేదు.. చరణ్, కమల్ సినిమాలు ఒకేసారి షూట్ చేస్తాను
ఇక కియారా రిలేషన్ గురించి అడుగుతూ నువ్వు సిద్దార్థ్‌తో రిలేషన్‌లో ఉన్నావు కదా అని అడగడంతో కియారా దీనికి ఎస్ అని చెప్పను నో అని చెప్పను అంటే కరణ్ మరి మీ ఇద్దరూ క్లోజ్ ఫ్రెండ్సా అని అడిగాడు. క్లోజ్ ఫ్రెండ్స్ కంటే కూడా ఎక్కువే అని కియారా చెప్పడంతో వీరిద్దరి రిలేషన్ పై ఒక క్లారిటీ వచ్చిందనే తెలుస్తుంది.