Kiccha Sudeep : మూగ అభిమానికి ఫుడ్ పెట్టి, డబ్బులు ఇచ్చి.. కిచ్చ సుదీప్ మంచి మనసు..

తాజాగా సుదీప్ కి సంబంధించిన ఓ వీడియో వైరల్ గా మారింది.

Kiccha Sudeep : మూగ అభిమానికి ఫుడ్ పెట్టి, డబ్బులు ఇచ్చి.. కిచ్చ సుదీప్ మంచి మనసు..

Kiccha Sudeep Helped to A Dumb Person Video goes Viral

Updated On : June 3, 2024 / 2:37 PM IST

Kiccha Sudeep : కిచ్చ సుదీప్ కన్నడ లో స్టార్ హీరో అని తెలిసిందే. మన తెలుగులో ఈగ సినిమాతో విలన్ గా పరిచయమై ఆ తర్వాత తన కన్నడ డబ్బింగ్ సినిమాలతో ఇక్కడి ప్రేక్షకులకు కూడా మరింత దగ్గరయ్యారు. సుదీప్ కి కర్ణాటకలో మంచి ఫ్యాన్ బేస్ ఉంది. తాజాగా సుదీప్ కి సంబంధించిన ఓ వీడియో వైరల్ గా మారింది.

Also Read : Love Today : జాన్వీ కపూర్ చెల్లితో ‘లవ్ టుడే’ రీమేక్.. స్టార్ హీరో తనయుడు హీరోగా..

సుదీప్ దగ్గరికి ఓ మూగ అభిమాని వచ్చాడు. సుదీప్, పునీత్ రాజ్ కుమార్ పెయింట్ ఉన్న ఓ ఫ్రేమ్ తీసుకొచ్చి సుదీప్ కి గిఫ్ట్ గా ఇచ్చాడు. తన కష్టాలు ఓ లేఖలో రాసి సుదీప్ కి ఇవ్వగా సుదీప్ అది చదివి తన కష్టాలు తెలుసుకొని కొంత అమౌంట్ చెక్ అప్పటికప్పుడు ఇచ్చాడు. అంతే కాకుండా ఆ అభిమాని చాలా దూరం నుంచి వచ్చాడని తెలిసి తిన్నావా అని అడిగి అతను తినకపోవడంతో అక్కడే తన ఇంట్లో ఫుడ్ పెట్టి పంపించాడు. తన కష్టాలు తెలుసుకొని డబ్బులు ఇవ్వడంతో ఆ మూగ అభిమాని సుదీప్ కాళ్ళ మీద పడి నమస్కరించాడు.

దీంతో ఈ వీడియో వైరల్ అవ్వడంతో మరోసారి సుదీప్ మంచి మనసుని ఫ్యాన్స్, నెటిజన్స్ అభినందిస్తున్నారు. గతంలో కూడా సుదీప్ పలు సేవా కార్యక్రమాలు చేసిన సంగతి తెలిసిందే.