ఆమె కిమ్ కంటే కిరాతకం.. ప్రపంచం లేడీ విలన్‌ను చూస్తుంది..

కాంట్రవర్సీ కింగ్ రామ్ గోపాల్ వర్మ ట్వీట్స్ ఎలా ఉంటాయో, ఏ విషయానికి ఎలా రియాక్ట్ అవుతాడో అనేది నెటిజన్లకెప్పుడూ మిలియన్ డాలర్ల ప్రశ్నే. ఇటీవల మందు డోర్ డెలివరీ చేయాలంటూ తెలుగు రాష్ట్రాల సీఎంలకు సలహా ఇచ్చి కేటీఆర్ చేత పంచ్ వేయించుకున్నాడు వర్మ. తాజాగా నార్త్ కొరియా అధ్యక్షుడు కిమ్ గురించి, అతని సోదరి గురించి ఆర్జీవీ చేసిన ట్వీట్ ఒకటి నెట్టింట బాగా వైరల్ అవుతోంది.
కొద్దిరోజులుగా కిమ్ మరణించాడనే వార్తలతో పాటు, ఆయన స్థానంలో అతని సోదరి అధ్యక్షురాలు కాబోతుందనే వార్తలు బాగా వినిపిస్తున్నాయి. ఈ వార్తలను ఆధారంగా చేసుకుని వర్మ తన స్టైల్లో ట్వీటాడు. ‘‘కిమ్ చనిపోయాడని, అతని స్థానంలో ఆయన సోదరి అధికారం చేపట్టనుందనే వార్తలు వింటున్నాను. ఆమె అతనికంటే అత్యంత కిరాతకమైన వ్యక్తి అని అంటున్నాను. ఒకవేళ ఇదే నిజమైతే మాత్రం ప్రపంచం మొత్తం ఫస్ట్ లేడీ విలన్‌ని చూస్తారు. ఇంకా చెప్పాలంటే జేమ్స్‌బాండ్ సినిమా రియల్ కాబోతోంది..’’ అని ట్వీట్ చేశాడు. వర్మ ట్వీట్ వెనుక గూడార్థం ఏమై ఉంటుందబ్బా అంటూ బుర్రలకు పని చెప్తున్నారు నెటిజన్లు