Rules Ranjann Trailer : రూల్స్ రంజన్ ట్రైలర్.. కామెడీ క్లాస్ మాస్ కలిపి కొత్తగా ట్రై చేస్తున్న కిరణ్ అబ్బవరం..

తాజాగా రూల్స్ రంజన్ సినిమా ట్రైలర్ విడుదలయింది. ట్రైలర్ లోనే కామెడీ, క్లాస్, మాస్ చూపించేసాడు కిరణ్ అబ్బవరం. ఇక సినిమాలో ఎన్ని వేరియేషన్స్ చూపిస్తాడో చూడాలి.

Rules Ranjann Trailer : రూల్స్ రంజన్ ట్రైలర్.. కామెడీ క్లాస్ మాస్ కలిపి కొత్తగా ట్రై చేస్తున్న కిరణ్ అబ్బవరం..

Kiran Abbavaram Neha Shetty Rules Ranjann Movie Trailer Released

Updated On : September 8, 2023 / 11:59 AM IST

Rules Ranjann Trailer :  టాలీవుడ్ యంగ్ హీరో కిర‌ణ్ అబ్బ‌వ‌రం (Kiran Abbavaram) జ‌యాప‌జ‌యాల‌తో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాడు. ఇప్పుడు ‘రూల్స్ రంజన్’ (Rules Ranjann)‌ సినిమాతో సెప్టెంబర్ 28న రాబోతున్నాడు. రత్నం కృష్ణ దర్శకత్వంలో తెర‌కెక్కుతున్న ఈ సినిమాలో నేహా శెట్టి క‌థానాయిక‌. నిర్మాత ఏ.ఎం. రత్నం సమర్పణలో స్టార్ లైట్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై దివ్యాంగ్ లవానియా, మురళి కృష్ణ వేమూరి ఈ సినిమాని నిర్మిస్తున్నారు.

ఇప్పటికే ఈ సినిమా నుంచి సమ్మోహనుడా అనే నేహశెట్టి సాంగ్ బాగా వైరల్ అయింది. తాజాగా రూల్స్ రంజన్ సినిమా ట్రైలర్ విడుదలయింది. ట్రైలర్ లోనే కామెడీ, క్లాస్, మాస్ చూపించేసాడు కిరణ్ అబ్బవరం. ఇక సినిమాలో ఎన్ని వేరియేషన్స్ చూపిస్తాడో చూడాలి.