Kishore Tirumala: ఆమె రిజెక్ట్ చేసేలా నేనే చేశాను.. కేవలం కీర్తి సురేష్ కోసమే.. మస్కా కొట్టిన డైరెక్టర్

నేను శైలజ సినిమాలో శైలు పాత్ర గురించి ఆసక్తికర విషయాలు చెప్పిన దర్శకుడు కిషోర్ తిరుమల(Kishore Tirumala).

Kishore Tirumala: ఆమె రిజెక్ట్ చేసేలా నేనే చేశాను.. కేవలం కీర్తి సురేష్ కోసమే.. మస్కా కొట్టిన డైరెక్టర్

Kishore Tirumala interesting comments about Nenu Sailaja movie.

Updated On : January 24, 2026 / 6:54 PM IST
  • కీర్తి సురేష్ కోసం రిస్క్ చేసిన దర్శకుడు
  • కావాలనే అలా చేశాడట
  • నేను శైలజ సినిమా గురించి ఆసక్తికర కామెంట్స్

Kishore Tirumala: నేను శైలజ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలో దర్శకుడిగా పరిచయం అయ్యాడు కిషోర్ తిరుమల. రామ్ పోతినేని, కీర్తి సురేష్ జంటగా వచ్చిన ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ ఆడియన్స్ ను ఒక రేంజ్ లో ఎంటర్టైన్ చేసింది. సినిమాలో లవ్, ఎమోషన్ చాలా బాగా సెట్ అయ్యింది. ఆ విషయంలో కిషోర్ తిరుమలను ప్రశంశించకుండా ఉండలేము. సినిమాలో ఫాదర్ ఎమోషన్ ని అద్భుతంగా ఎలివేట్ చేశాడు. ఇక ఈ సినిమాతోనే మహానటి కీర్తి సురేష్ హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది.

అయితే, తాజాగా ఈ సినిమాలో కీర్తి సురేష్ ను తీసుకోవడం గురించి ఆసక్తికర కామెంట్స్ చేశాడు దర్శకుడు కిషోర్ తిరుమల(Kishore Tirumala). ఆయన చేసిన రీసెంట్ మూవీ భర్త మహాశయులకు విజ్ఞప్తి. రీసెంట్ గా విడుదలైన ఈ సినిమాకు ఆడియన్స్ నుంచి పాజిటీవ్ టాక్ వచ్చింది. అయితే, ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇంటర్వ్యూ లో పాల్గొన్న కిషోర్ తిరుమల నేను శైలజ సినిమాలో కీర్తి సురేష్ ను తీసుకోవడం గురించి మాట్లాడాడు.

Anushree: అనుశ్రీ పరువాల విందు.. క్రేజీ ఫోటోలు వైరల్

నేను శైలజ సినిమాలో ‘శైలజ’ పాత్ర చాలా ఇంపార్టెంట్. ఆ పాత్ర ఒక ఇంట్రోవర్ట్. కాబట్టి, కీర్తి సురేశ్ అయితేనే పర్ఫెక్ట్‌గా ఉంటుందని నేను చాలా నమ్మాను. కానీ, నిర్మాతలు మాత్రం ఒక స్టార్ హీరోయిన్‌ను తీసుకోవాలని చెప్పారు. కాస్త ఒత్తిడితో ఆ హీరోయిన్‌కు కథ చెప్పడానికి వెళ్లాను. కానీ, ఆమె ఆ కథను రిజెక్ట్ చేయాలని కావాలని సరిగ్గా చెప్పలేదు. ఆమె కూడా కథ నచ్చలేదని చెప్పింది. హ్యాపీ ఫీలయ్యాను.

ఎందుకంటే, ఇమేజ్ ఉన్న హీరోయిన్‌ను తీసుకుంటే నా సినిమాలో ‘శైలజ’గా చూపించడం కష్టం. అందుకే కొత్త అమ్మాయి అయితే నిజంగా ‘శైలు’గా ఫీల్ అవుతారని నమ్మాను. చివరకు నా నమ్మకమే నిజమైంది. కీర్తి సురేష్ శైలజ పాత్రకు ప్రాణం పోసింది” అంటూ చెప్పుకొచ్చాడు కిషోర్ తిరుమల. దీంతో ఆయన చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.