Tarakaratna Father : తారకరత్న తండ్రి సినిమాటోగ్రాఫర్ అని తెలుసా? స్టార్ హీరోల సినిమాలకు కెమెరామెన్ గా వర్క్ చేసిన మోహన కృష్ణ..
తారకరత్న తండ్రి మోహన కృష్ణ కూడా సినీ పరిశ్రమకు చెందిన వారని చాలా తక్కువ మందికి తెలుసు. చిన్నప్పటి నుంచి మోహనకృష్ణ సినిమాలపై ఆసక్తి పెంచుకున్నారు. ఆయితే తండ్రిలా నటన వైపు కాకుండా సినిమాటోగ్రఫీ వైపు వెళ్లారు. చదువుకుంటూనే.............

Tarakaratna father a star cameramen in film industry
Tarakaratna Father : తెలుగు సినీపరిశ్రమలో గత కొంత కాలంగా వరుసగా పలువురు ప్రముఖులు మరణిస్తూ విషాదాన్ని మిగిల్చారు. తాజాగా నటుడు నందమూరి తారకరత్న గత కొన్ని రోజులుగా బెంగుళూరులోని నారాయణ హృదయాలయ హాస్పిటల్ లో వెంటిలేటర్ పై చికిత్స పొందుతూ శనివారం రాత్రి కన్నుమూశారు. దీంతో మరోసారి సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది.
ఎన్టీఆర్ మనవడిగా, నందమూరి మోహన కృష్ణ కుమారుడిగా తారకరత్న 20 ఏళ్ళ వయసులోనే ఒకటో నంబర్ కుర్రాడు చిత్రంతో తెలుగు తెరకు పరిచయమయ్యాడు. అయితే తారకరత్న తండ్రి మోహన కృష్ణ కూడా సినీ పరిశ్రమకు చెందిన వారని చాలా తక్కువ మందికి తెలుసు. సీనియర్ ఎన్టీఆర్ కు 8 మంది మగపిల్లలు, 4 ఆడపిల్లలు. మొత్తం 12 మంది సంతానంలో తారకరత్న తండ్రి మోహన కృష్ణ అయిదవవాడు. ఈయన అనేక సినిమాలకు కెమెరా మెన్ గా పనిచేశారు. పలు సినిమాలకు నిర్మాతగా కూడా వ్యవహరించారు.
చిన్నప్పటి నుంచి మోహనకృష్ణ సినిమాలపై ఆసక్తి పెంచుకున్నారు. ఆయితే తండ్రిలా నటన వైపు కాకుండా సినిమాటోగ్రఫీ వైపు వెళ్లారు. చదువుకుంటూనే కెమెరా వర్క్ నేర్చుకున్నారు. ఎన్టీఆర్ దానవీరశూరకర్ణ సినిమాకు మొదట అసిస్టెంట్ కెమెరామెన్‌గా పని చేశారు. ఆ తర్వాత పలు సినిమాలకు కెమెరా డిపార్ట్మెంట్ లో పనిచేసిన మోహనకృష్ణ ఎన్టీఆర్ హీరోగా తాతినేని రామారావు దర్శకత్వంలో రామకృష్ణ సినీ స్టూడియోస్ బ్యానర్‌లో తెరకెక్కిన ‘అనురాగ దేవత’ సినిమాతో సినిమాటోగ్రాఫర్‌గా మారారు.
ఇక అక్కడ్నుంచి తండ్రి ఎన్టీఆర్ సినిమాలు చండశాసనుడు, శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర, కత్తుల కొండయ్య, అల్లరి కృష్ణయ్య, దేశోద్దారకుడు, శ్రీనివాస కళ్యాణం, బ్రహ్మర్షి విశ్వామిత్ర, భార్గవ రాముడు, పట్టాభిషేకం, అశోక చక్రవర్తి, పెద్దన్నయ్య, గొప్పింటి అల్డుడు, శ్రీనాథ కవిసార్వభౌముడు, శ్రీనివాస కళ్యాణం.. లాంటి సూపర్ హిట్ సినిమాలకు సినిమాటోగ్రాఫర్ గా పనిచేశారు. కెమెరా మెన్ గా సినిమాలకు దూరమయ్యాక పలు సినిమాలకు నిర్మాతగా వ్యవహరించారు. చివరగా తనయుడు తారకరత్న హీరోగా నటించిన వెంకటాద్రి సినిమాకు నిర్మాతగా వ్యవహరించారు. అనంతరం సినీ పరిశ్రమకు దూరమయ్యారు.
Tarakaratna Wife : తారకరత్న భార్య కూడా సినీ పరిశ్రమే.. తారక్, అలేఖ్య లవ్ స్టోరీ తెలుసా??
ఇప్పుడు తనయుడు తారకరత్న అకాల మరణం చెందటంతో మోహనకృష్ణ తీవ్ర విషాదంలో మునిగిపోయారు. తండ్రే కొడుకుకి అంతిమ సంస్కారాలు చేయాల్సి వస్తుండటంతో ఎంతగానో కుమిలిపోతున్నారు మోహనకృష్ణ. పలువురు ప్రముఖులు మోహనకృష్ణని ఓదారుస్తున్నారు.