Konda Surekha – KTR : నాగ చైతన్య విడాకులకు కేటీఆర్ కారణం అంటూ కొండా సురేఖ సంచలన ఆరోపణలు..
మాజీ మంత్రి కేటీఆర్ పై మంత్రి కొండా సురేఖ సంచలన ఆరోపణలు చేసారు.

Konda Surekha – KTR : మాజీ మంత్రి కేటీఆర్ పై మంత్రి కొండా సురేఖ సంచలన ఆరోపణలు చేసారు. తాజాగా కొండా సురేఖ ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ.. నాగ చైతన్య విడాకులకు కేటీఆర్ కారణం. హీరోయిన్స్ కు మత్తు పదార్థాలు అలవాటు చేసింది, వాళ్ళ జీవితాలతో ఆడుకుంది కేటీఆర్. హీరోయిన్ల ఫోన్ ట్యాప్ చేసింది నువ్వే కదా ఇప్పుడు సిగ్గు లేకుండా కేటీఆర్ మాట్లాడుతున్నారు. దొంగ ఏడుపులు నాకు అవసరం లేదు. నన్ను మూడు అకౌంట్ లు దుబాయ్ నుండి పోస్టులు చేస్తూ ట్రోల్ చేస్తున్నారు, నువ్వెందుకు రియాక్ట్ కాలేదు. మనసుల మధ్య అనుబంధాలు, విలువలు ఉన్నాయా నీకు అంటూ సంచలన ఆరోపణలు చేసారు.
Also Read : Pawan Kalyan – Karthi : కార్తీ, తిరుమల లడ్డు వివాదంపై మళ్ళీ మాట్లాడిన పవన్ కళ్యాణ్.. కార్తీ, సూర్య ఇద్దరూ..
దీంతో కొండా సురేఖ వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. నాగ చైతన్య – సమంత ప్రేమించి పెళ్లి చేసుకొని కొన్నాళ్ళకు విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. వారి విడాకులపై రకరకాల రూమర్లు గతంలో వినిపించాయి. ఇప్పుడు కొండా సురేఖ ఇలా సంచలన ఆరోపణలు చేయడంతో ఈ వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. మరి దీనిపై కేటీఆర్, బీఆర్ఎస్ నేతలు ఎలా స్పందిస్తారో చూడాలి.