Koratala Shiva, Bunny: బన్నీ కొరటాల శివ సినిమా వుంటుందా?

Koratala Shiva, Bunny: బన్నీ కొరటాల శివ సినిమా వుంటుందా?

Koratala Shiva Banni Movie Suspense

Updated On : April 14, 2021 / 11:54 AM IST

Koratala siva, Bunny: బన్నీతో సినిమా చెయ్యాల్సిన కొరటాల శివ.. ఆ ప్రాజెక్ట్ పక్కకు పెట్టినట్లుగా వార్తలు గుప్పుమంటున్నాయి.. సోషల్ మీడియాలో మంగళవారం నుంచి దీనిపైనే చర్చ నడుస్తుంది.. బన్నీ ప్రాజెక్టు పక్కకు పెట్టి ఎన్టీఆర్ దగ్గరకు వెళ్లినట్లుగా సోషల్ మీడియా వేదికగా చర్చ నడుస్తుంది. ఈ నేపథ్యంలో యువసుధ సంస్థ ఓ ట్వీటు చేసింది.

కొరటాల శివ దర్శకత్వంలో బన్నీ సినిమా ఉందని.. ఏప్రిల్ 2022 తర్వాత షూటింగ్ ప్రారంభం అవుతుందని పేర్కొంది. ఈ ట్వీట్ పై కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అభిమానుల దాడిని తాత్కాలికంగా తగ్గించడానికి ఈ ట్విట్ చేసినట్లు కనిపిస్తుంది.. నిజంగా ఈ ప్రాజెక్ట్ ఉందా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే కొరటాల తన ప్రాజెక్ట్ ను ఎన్టీఆర్ కు షిఫ్ట్ చేయడం బన్నీకి తెలిసే జరిగింది అనేది విశ్వసనీయ వర్గాల నుంచి వస్తున్న సమాచారం. కొరటాల ప్రాజెక్ట్ షిఫ్ట్ చేయడంపై బన్నీ గుర్రుగా ఉన్నాడని సమాచారం.

బన్నీ నెక్స్ట్ మూవీ త్రివిక్రమ్ దర్శకత్వంలో ఉంటుందని టాక్.. మహేష్ సినిమా పూర్తి చేసుకొని త్రివిక్రమ్ బన్నీ ప్రాజెక్టు స్టార్ట్ చేస్తారని తెలుస్తుంది. ఇది 2022 ఏప్రిల్ లో ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఇక యువసుధ చేసిన ట్వీట్ సినిమా ఉంది అన్నట్లు చెప్పినా దానికి కొరటాల శివ లైక్ కానీ, రీట్వీట్ కానీ చెయ్యలేదు. దీన్ని కూడా ఫ్యాన్స్ ఎత్తిచూపుతున్నారు.