Devara 2 – Koratala Siva : ‘దేవర 2’ పై కొరటాల శివ కామెంట్స్.. మీరు చూసింది 10 శాతమే.. షూటింగ్ ఎప్పట్నించి అంటే..
దేవర సక్సెస్ తర్వాత కూడా కొరటాల కొన్ని ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ఈ క్రమంలో దేవర పార్ట్ 2 గురించి ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు.

Koratala Siva Comments on TR Devara Part 2 Movie
Devara 2 – Koratala Siva : కొరటాల దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా వచ్చిన దేవర సినిమా ఇటీవల రిలీజయి మంచి విజయం సాధించి ఇప్పటికే 450 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది. దేవర సినిమా తర్వాత ప్రేక్షకులకు చాలా సందేహాలు వచ్చిన సంగతి తెలిసిందే. ఆ సందేహాలకు సమాధానాలు అన్ని పార్ట్ 2 లోనే చెప్తారని వెయిట్ చేస్తున్నారు ప్రేక్షకులు. అలాగే జాన్వీ కపూర్ నిడివి సినిమాలో చాలా తక్కువ ఉందని, ఈ మాత్రం దానికి జాన్వీని తీసుకురావాలా అని కామెంట్స్ చేస్తున్నారు.
దేవర సక్సెస్ తర్వాత కూడా కొరటాల కొన్ని ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ఈ క్రమంలో దేవర పార్ట్ 2 గురించి ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. కొరటాల శివ మాట్లాడుతూ.. దేవర 2 లో జాన్వీ పాత్ర చాలా ఎక్కువే ఉంటుంది. అలాగే పవర్ ఫుల్ గా కూడా ఉంటుంది. జాన్వీ పాత్రని చూసి ప్రేక్షకులు ఆశ్చర్యపోతారు. సీట్ ఎడ్జ్ కి వచ్చే ట్విస్ట్ లు ఉంటాయి సినిమాలో. కథలో అసలు మలుపు పార్ట్ 2 లోనే ఉంటుంది. పార్ట్ 1లో మీరు చూసింది 10 శాతమే, అసలైన సినిమా పార్ట్ 2 లోనే ఉంది. ప్రతి పాత్రకు ట్విస్ట్ ఉంటుంది. కొన్ని సీన్స్ అయితే మీరు మర్చిపోలేరు అని అన్నారు. దీంతో కొరటాల శివ వ్యాఖ్యలు వైరల్ అవ్వగా ఇప్పట్నుంచే ఫ్యాన్స్ దేవర 2పై అంచనాలు పెంచుకుంటున్నారు.
Also Read : Gautam Ghattamaneni : అమెరికాలో ఫ్రెండ్స్‌తో ఎంజాయ్ చేస్తున్న మహేష్ తనయుడు.. రాత్రి పూట రోడ్ల మీద..
ఇక దేవర 2 సినిమా షూటింగ్ వచ్చే సంవత్సరం అక్టోబర్ లో మొదలుపెడతారని సమాచారం. అప్పటికి ఎన్టీఆర్ వార్ 2, ప్రశాంత్ నీల్ సినిమా షూట్ పూర్తి చేస్తారని తెలుస్తుంది. కొరటాల శివ మరో నెల రోజుల్లో దేవర పార్ట్ 2 కథపై కూర్చుంటాడని ఇటీవల ఎన్టీఆర్ ఓ హాలీవుడ్ ఇంటర్వ్యూలో తెలిపాడు.