Kota Srinivasa Rao : నటుడిగానే కాదు.. పవన్, అఖిల్ సినిమాల్లో సింగర్ గా.. ఆ పాటలేంటో తెలుసా? డబ్బింగ్ ఆర్టిస్ట్ గా కూడా..
ఆయన నటుడిగానే అందరికి తెలుసు.

Kota Srinivasa Rao
Kota Srinivasa Rao : ఎన్నో విలక్షణ పాత్రలతో ఏకంగా 750 సినిమాలకు పైగా నటించి మెప్పించిన నటుడు కోట శ్రీనివాసరావు. ఆయన నేడు తెల్లవారుజామున వయోభారం, ఆరోగ్య సమస్యలతో మరణించారు. సినీ ప్రముఖులు, అభిమానులు ఆయనకు నివాళులు అర్పిస్తున్నారు.
ఆయన నటుడిగానే అందరికి తెలుసు. కానీ డబ్బింగ్ ఆర్టిస్టుగా కొన్ని తమిళ్ డబ్బింగ్ సినిమాలకు పనిచేసారు. అలాగే సింగర్ గా కూడా పాటలు పాడారు.
కోట శ్రీనివాసరావు సింగర్ గా మొదటిసారి అఖిల్ చిన్నపిల్లాడిగా ఉన్నప్పుడు నటించిన సిసింద్రీ సినిమాలో పాడారు. 1995 లో వచ్చిన సిసింద్రీ సినిమాలో ‘హలో బాసు..’ అంటూ సాగే పాటను కోట శ్రీనివాసరావు సింగర్స్ మనో, మురళీధర్ లతో కలిసి పాడారు. అనంతరం పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ సినిమాలో ‘మందు బాబులం..’ అని సాగే పాటను పాడారు. ఆ పాట ఎంత పెద్ద హిట్ అయిందో తెలిసిందే.
ఇక డబ్బింగ్ ఆర్టిస్ట్ గా కోట శ్రీనివాసరావు తమిళ్ డబ్బింగ్ సినిమాలయిన జెంటిల్ మ్యాన్, భారతీయుడు, నరసింహ, ప్రేమికుల రోజు, ఒకే ఒక్కడు, ప్రియురాలు పిలిచింది, బాబా, మజా, శివాజీలలో నటులు గౌండమని, మణివణ్ణన్ లకు తెలుగు డబ్బింగ్ చెప్పారు.