Krithi Shetty: పవన్ సినిమాలో బేబమ్మ.. లక్ మాములుగా లేదుగా!
తొలిసినిమాతోనే పిచ్చ క్రేజ్ దక్కించుకొని వరస సినిమాలకు సైన్ చేయడం చాలా తక్కువమంది నటీనటులకు దక్కుతుంది. ఇలా జరిగితే ఇది నిజంగా లక్ అనే అనుకోవాలి. ఉప్పెన సినిమాతో కుర్రాళ్ళ హృదయాల్లో నిజంగానే ఉప్పెన సృష్టించిన కృతి శెట్టి ఆ సినిమా తెచ్చిన క్రేజ్ తో అరడజను అవకాశాలను కొట్టేసింది.

Krithi Shetty
Krithi Shetty: తొలిసినిమాతోనే పిచ్చ క్రేజ్ దక్కించుకొని వరస సినిమాలకు సైన్ చేయడం చాలా తక్కువమంది నటీనటులకు దక్కుతుంది. ఇలా జరిగితే ఇది నిజంగా లక్ అనే అనుకోవాలి. ఉప్పెన సినిమాతో కుర్రాళ్ళ హృదయాల్లో నిజంగానే ఉప్పెన సృష్టించిన కృతి శెట్టి ఆ సినిమా తెచ్చిన క్రేజ్ తో అరడజను అవకాశాలను కొట్టేసింది. ఇప్పటికీ ఇంకా వరస సినిమాలకు సైన్ చేస్తూనే ఉన్నట్లుగా కనిపిస్తుంది.
కృతి శెట్టి ప్రస్తుతం తెలుగులో ‘ఆ అమ్మాయి గురించి మీకుచెప్పాలి’, ‘శ్యామ్ సింగరాయ్’తో పాటు దర్శకుడు లింగు స్వామి, హీరో రామ్ పోతినేని కాంబినేషన్ లో తెరకెక్కే ద్విభాషా సినిమాల్లో హీరోయిన్‌గా చేస్తోంది. అది అలా ఉంటే కృతి శెట్టికి మరో భారీ అవకాశం వచ్చినట్లు తెలుస్తోంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దర్శకుడు హరీష్ శంకర్ కాంబినేషన్ లో మరో సినిమాకు సన్నాహాలు జరుగుతున్న సంగతి తెలిసిందే.
కాగా ఈ సినిమాలో కృతి శెట్టిని ఓ కీలకపాత్ర కోసం తీసుకుంటున్నారని తెలుస్తోంది. ఈ సినిమాలో హీరో పవన్ పాత్రకు అన్నయ్య కూతురుగా ఓ కీలక పాత్ర ఉందట. సినిమాలో కీలకమైన ఈ పాత్ర కోసం కాస్త వయసు తక్కువగా పేరున్న నటి కావాలని దర్శకుడు హరీష్ శంకర్ ప్రయత్నాల్లో ఉన్నాడట. ఉప్పెనతో మెగా ఫ్యామిలీతో మంచి రాపో మైంటైన్ చేస్తున్న కృతి అయితే ఈ పాత్రకు సరిగ్గా సరిపోతుందని భావించిన హరీష్ ఇప్పటికే ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు తెలుస్తుంది. ఇదే జరిగితే కృతి లక్ ఓ రేంజిలో ఉన్నట్లే భావించాలి.