Kriti Sanon : పెద్ద హీరోలు ఉన్నంత మాత్రాన థియేటర్స్‌కి ప్రేక్షకులు రారు.. ఇండస్ట్రీలో నటుల మధ్య యూనిటీ లేదు..
కృతి సనన్ క్రూ సక్సెస్ ప్రెస్ మీట్ లో సంచలన వ్యాఖ్యలు చేసింది.

Kriti Sanon Sensational Comments on Bollywood Industry and Star Heros
Kriti Sanon : కృతి సనన్, టబు(Tabu), కరీనా కపూర్(Kareena Kapoor) ముఖ్య పాత్రలుగా తెరకెక్కిన హిందీ సినిమా ‘క్రూ’ మార్చ్ 29న రిలీజయి మంచి విజయం సాధించింది. ఈ సినిమా రెండు వారాల్లోనే 100 కోట్ల కలెక్షన్స్ సాధించింది. దీంతో ఈ చిత్రయూనిట్ తాజాగా సక్సెస్ ప్రెస్ మీట్ నిర్వహించగా కృతి సనన్ ఈ ప్రెస్ మీట్ లో సంచలన వ్యాఖ్యలు చేసింది.
కృతి సనన్ మాట్లాడుతూ.. సినిమాలో ఒక స్టార్ హీరో ఉన్నంత మాత్రాన ప్రేక్షకులు పరిగెత్తుకుంటూ రారు. కథ బాగుండాలి. దురదృష్టం ఏంటంటే ఇండస్ట్రీలో కొంతమంది దర్శకులు, నిర్మాతలకు కూడా ఈ విషయం అర్ధం కావట్లేదు. లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు ప్రేక్షకులు రారు, పెట్టిన డబ్బు రాదు అని అనుకుంటున్నారు. ఇది అబద్దం. స్టార్ హీరోలెవ్వరూ లేకపోయినా మా క్రూ సినిమా బాగా ఆడుతుంది. ఇప్పటికే 100 కోట్లు కలెక్ట్ చేసింది. అలియాభట్ మెయిన్ లీడ్ లో వచ్చిన గంగూభాయ్ కతీయవాడి సినిమా కూడా పెద్ద హిట్ అయి కలెక్షన్స్ తెచ్చింది. అందులో కూడా స్టార్ హీరోలు లేరు. లేడీ ఓరియెంటెడ్ సినిమాలు హిట్స్ కొడుతున్నా హీరోయిన్స్ సినిమాలకు బడ్జెట్ పరిమితులు ఎందుకు పెడుతున్నారో అర్ధం కావట్లేదు అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది.
Also Read : Munawar Faruqui : బిగ్‌బాస్ విజేతపై కోడిగుడ్లతో దాడి.. గొడవకు దిగిన బిగ్ బాస్ విన్నర్..
అలాగే కృతి సనన్ బాలీవుడ్ నటీనటుల గురించి మాట్లాడుతూ.. ఇండస్ట్రీలో మొహమాటానికి ఒకర్నొకరు పొగుడుతున్నారు. దానికంటే ఆపదలో ఉన్న తోటి నటీనటులకు సహాయంగా నిలబడితే బాగుంటుంది. ఇక్కడ నటీనటుల మధ్య యూనిటీ అంతగా లేదు. ఒక సినిమా హిట్ అయినప్పుడు ఎంతమంది హ్యాపీగా ఫీల్ అవుతున్నారో, ఎంతమంది ఏడుస్తున్నారో అర్ధం కావట్లేదు అని సంచలన వ్యాఖ్యలు చేసింది. దీంతో కృతి సనన్ చేసిన వ్యాఖ్యలు బాలీవుడ్ లో చర్చగా మారాయి.