Himanshu Rao : విజయ్ దేవరకొండ అదరగొట్టాడు.. ‘కింగ్డమ్’ సినిమాపై కేటీఆర్ తనయుడి రివ్యూ..

కేటీఆర్ తనయుడు హిమాన్షు కింగ్డమ్ సినిమాను చూసాను అంటూ ట్వీట్ చేసాడు.

Himanshu Rao : విజయ్ దేవరకొండ అదరగొట్టాడు.. ‘కింగ్డమ్’ సినిమాపై కేటీఆర్ తనయుడి రివ్యూ..

Himanshu Rao

Updated On : July 31, 2025 / 4:22 PM IST

Himanshu Rao : విజయ్ దేవరకొండ కింగ్డమ్ సినిమా నేడు రిలీజయింది. థియేటర్స్ లో రిలీజయిన ఈ సినిమా మిశ్రమ రివ్యూలు తెచ్చుకుంటుంది. విజయ్, సత్యదేవ్ తమ పర్ఫార్మెన్స్ లతో అదరగొట్టారు. అనిరుధ్ తన సంగీతంతో సినిమాని నిలబెట్టాడు. ఇప్పటికే సినిమా చూసిన పలువురు సెలబ్రిటీలు సైతం సోషల్ మీడియాలో సినిమా గురించి మాట్లాడుతున్నారు.

ఈ క్రమంలో కేటీఆర్ తనయుడు హిమాన్షు కింగ్డమ్ సినిమాను చూసాను అంటూ ట్వీట్ చేసాడు. హిమాన్షు ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సుదర్శన్ థియేటర్లో కింగ్డమ్ సినిమా చూసాడు.

Also Read : Vijay Sethupathi : నన్ను, నా ఫ్రెండ్ ని విజయ్ ఇబ్బంది పెట్టాడు.. క్యాస్టింగ్ కౌచ్ ఆరోపణలు.. స్పందించిన హీరో..

హిమాన్షు తన ట్వీట్ లో.. ఇప్పుడే RTC క్రాస్ రోడ్స్ లో కొంతమంది ఫ్రెండ్స్ తో కలిసి కింగ్డమ్ సినిమా చూసాను. థియేటర్ లో రెస్పాన్స్ అదిరిపోయింది. ఆడియన్స్, థియేటర్ అనుభవం, స్క్రీన్ మీద ఎనర్జీ.. ఇవన్నీ కలిసి గూస్ బంప్స్ ఇచ్చాయి. విజయ్ దేవరకొండ పర్ఫార్మెన్స్ తో అదరగొట్టాడు. సినిమా నచ్చింది అని తెలిపాడు.

 

Also Read : Kingdom : ‘కింగ్డమ్’ మూవీ రివ్యూ.. అన్న కోసం తమ్ముడు మొత్తం తగలపెట్టేశాడా?