లక్ష్మీపార్వతి-చంద్రబాబుని చూసారా?

లక్ష్మీస్ ఎన్టీఆర్‌లో లక్ష్మీపార్వతి, చంద్రబాబు నాయుడు క్యారెక్టర్స్ చేస్తున్న ఆర్టిస్ట్‌లను రివీల్ చేసిన వర్మ

  • Published By: sekhar ,Published On : January 12, 2019 / 05:39 AM IST
లక్ష్మీపార్వతి-చంద్రబాబుని చూసారా?

లక్ష్మీస్ ఎన్టీఆర్‌లో లక్ష్మీపార్వతి, చంద్రబాబు నాయుడు క్యారెక్టర్స్ చేస్తున్న ఆర్టిస్ట్‌లను రివీల్ చేసిన వర్మ

కాంట్రవర్సీ కింగ్, రామ్ గోపాల్ వర్మ లక్ష్మీ’S ఎన్టీఆర్.. అసలు కథ సినిమా పనుల్లో బిజీ అయిపోయాడు. ఈ సినిమాలో నుండి ఇప్పటివరకూ, వెన్నుపోటు, ఎందుకు, ఎందుకు, ఎందుకు? అనే రెండు పాటలను రిలీజ్ చేసి వర్మ, సోషల్ మీడియాలో పెద్ద రచ్చ లేపాడు. రీసెంట్‌గా లక్ష్మీస్ ఎన్టీఆర్‌లో లక్ష్మీపార్వతి, చంద్రబాబు నాయుడు క్యారెక్టర్స్ చేస్తున్న ఆర్టిస్ట్‌లను రివీల్ చెయ్యడంతో పాటు, వారి ఫస్ట్ లుక్స్‌ని కూడా రిలీజ్ చేసి, మరోసారి అందరికీ షాక్ ఇచ్చాడు. ఈ మూవీలో కన్నడ నటి యజ్ఞ శెట్టి, లక్ష్మీపార్వతి క్యారెక్టర్ చేస్తుంది. ఈమె ఇంతకుముందు వర్మ డైరెక్ట్ చేసిన కిల్లింగ్ వీరప్పన్ మూవీలో, వీరప్పన్ భార్య ముత్తులక్ష్మీగా నటించింది. లక్ష్మీస్ ఎన్టీఆర్‌లో యజ్ఞ శెట్టి లుక్‌ని వర్మ ట్విట్టర్ ద్వారా రిలీజ్ చేసాడు.

 

ఎన్టీఆర్ జీవితంలోకి లక్ష్మీ పార్వతి వచ్చిన తర్వాత జరిగే పరిణామాల నేపథ్యంలో రూపొందబోతున్న సినిమా కాబట్టి యజ్ఞ క్యారెక్టర్ హైలెట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇక చంద్రబాబు పాత్రలో శ్రీతేజ్ కనిపించనున్నాడు. ఇతను ఇంతకుముందు వర్మ వంగవీటిలో దేవినేని నెహ్రూ క్యారెక్టర్ చేసాడు. ఎన్టీఆర్ కథానాయకుడులోనూ, వై.ఎస్.రాజశేఖర రెడ్డిగా నటించాడు. శ్రీతేజ్, చూడ్డానికి చంద్రబాబులా ఉన్నాడు ఈ లుక్‌లో.. కళ్యాణి మాలిక్ ఈ మూవీకి మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు. లక్ష్మీస్ ఎన్టీఆర్‌తో వర్మ ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తాడో చూడాలి మరి… 

వాచ్ ఎందుకు, ఎందుకు సాంగ్…