ఎందుకు సాంగ్ – ఆర్జీవీ ప్రశ్నల బాణాలు
లక్ష్మీ'S ఎన్టీఆర్‌లోని ఎందుకు, ఎందుకు అనే పాట మొత్తం ఆర్జీవీ సంధిస్తున్న ప్రశ్నలు, బాణాల్లా దూసుకెళ్తున్నట్టుంది.
లక్ష్మీ’S ఎన్టీఆర్‌లోని ఎందుకు, ఎందుకు అనే పాట మొత్తం ఆర్జీవీ సంధిస్తున్న ప్రశ్నలు, బాణాల్లా దూసుకెళ్తున్నట్టుంది.
మొన్నటికి మొన్న, స్వర్గీయ ఎన్టీఆర్ జీవిత కథ ఆధారంగా బాలకృష్ణ నటిస్తున్న ఎన్టీఆర్ కథానాయకుడు, ఎన్టీఆర్ మహానాయకుడు రెండు భాగాలకు సంబంధించిన ఆడియో మరియు ట్రైలర్ రిలీజ్, మరికొద్ది సేపట్లో జరగబోతుంది అనగా, కాంట్రవర్సీ కింగ్, రామ్ గోపాల్ వర్మ అన్నమాట ప్రకారం.. తను తీస్తున్న లక్ష్మీ’S ఎన్టీఆర్.. అసలు కథ సినిమా నుండి, వెన్నుపోటు అంటూ సాగే ఫస్ట్‌సాంగ్‌ని రిలీజ్ చేసి, సోషల్ మీడియాలో పెద్ద రచ్చ లేపాడు. ఇప్పుడు, ఎన్టీఆర్ కథానాయకుడు మరి కొద్ది గంటల్లో థియేటర్స్‌లోకి వస్తుండగా, లక్ష్మీ’S ఎన్టీఆర్ మూవీలోని ఎందుకు, ఎందుకు అనే రెండవ పాటని రిలీజ్ చేసి, మరో సారి వాడి వేడి చర్చకు తెర తీసాడు.
ఈ సినిమాకి మ్యూజిక్ కంపోజ్ చేస్తున్న కళ్యాణి మాలిక్, సింగర్ శ్రీ కృష్ణ కలిసి ఈ పాట పాడగా, సిరాశ్రీ లిరిక్స్ రాసాడు. రీసెంట్‌గా రిలీజ్ చేసిన ఎందుకు, ఎందుకు అనే పాట మొత్తం ఆర్జీవీ సంధిస్తున్న ప్రశ్నలు, బాణాల్లా దూసుకెళ్తున్నట్టుంది. జయసుధ, జయప్రద, శ్రీదేవి, కృష్ణ కుమారి, సావిత్రి, అంజలీ దేవి.. వీళ్ళందరినీ వదిలి, ఆ లక్ష్మీ పార్వతిని ఎందుకు, ఎందుకు, ఎందుకూ అంటూ మొదలైన ఈ పాటలో, ఎన్టీఆర్ పర్సనల్ మరియు రాజకీయాలకు సంబంధించిన పలు అంశాల గురించి చెప్తూ, అవన్నీ లక్ష్మీ పార్వతి చుట్టూ తిరుగుతున్నట్టు, ఆమెనే హైలెట్ చేస్తూ, ప్రశ్నించడంలా సాగుతుంది. సాంగ్ చివర్లో, జనాలకు తెలియని నిజాలను నిర్భయంగా తెలియచెప్పడమే లక్ష్మీస్ ఎన్టీఆర్ ఉద్దేశం అంటూ తన వాయిస్ ఓవర్‌తో చెప్పుకొచ్చాడు వర్మ.
వాచ్ ఎందుకు, ఎందుకు సాంగ్…