Taraka Ratna Daughter : ఘనంగా తారకరత్న కూతురు హాఫ్ శారీ ఫంక్షన్.. ఫొటోలు, వీడియో వైరల్..
ఇటీవల తారక రత్న - అలేఖ్య రెడ్డి పెద్ద కూతురు నిష్క హాఫ్ శారీ ఫంక్షన్ ని ఘనంగా నిర్వహించారు.

Late Taraka Ratna Daughter Nishka Half Saree Function Photos Videos goes Viral
Taraka Ratna Daughter : గత సంవత్సరం హీరో తారకరత్న మరణించిన సంగతి తెలిసిందే. తారకరత్న మరణం తర్వాత అతని భార్య అలేఖ్య రెడ్డి రెగ్యులర్ గా సోషల్ మీడియాలో ఆయన్ని తలుచుకుంటూ పోస్టులు చేస్తుంది. తన పిల్లలకు సంబంధించి, తారకరత్నతో ఉన్న జ్ఞాపకాలు, ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తుంది. తాజాగా నేడు తారకరత్న కూతురు నిష్క హాఫ్ శారీ ఫంక్షన్ అయిందంటూ దానికి సంబంధించిన పలు ఫొటోలు, వీడియోలు షేర్ చేసింది అలేఖ్య రెడ్డి.
Also Read : Prabhas : నా కెరీర్లో బిగ్గెస్ట్ సాంగ్స్‌లో అది ఒకటి.. వాళ్ళు ఇప్పుడు లేరా అనిపిస్తుంది.. ప్రభాస్ ఎమోషనల్..
ఇటీవల తారక రత్న – అలేఖ్య రెడ్డి పెద్ద కూతురు నిష్క హాఫ్ శారీ ఫంక్షన్ ని ఘనంగా నిర్వహించారు. ఈ ఫంక్షన్ లో తారకరత్న ఫోటో పెట్టి ఆయనకు నివాళులు కూడా అర్పించి కార్యక్రమం నిర్వహించారు, నిష్క హాఫ్ శారీలో వచ్చి నాన్నకి నివాళులు అర్పించింది. అమ్మతో, వచ్చిన బంధువులతో కలిసి ఫొటోలు దిగింది. ఇక ఈ ఫంక్షన్ అలేఖ్య రెడ్డి పెదనాన్న, వైసీపీ నేత విజయసాయి రెడ్డి చేతుల మీదుగా జరిగినట్టు తెలుస్తుంది.
అలేఖ్య రెడ్డి షేర్ చేసిన వీడియోలో నందమూరి ఫ్యామిలీకి చెందిన వాళ్ళెవ్వరూ లేకపోవడంతో ఈ ఫంక్షన్ కి ఎవరూ రాలేదా, పిలవలేదా అని సందేహం వ్యక్తపరుస్తున్నారు. ప్రస్తుతం తారకరత్న కూతురు నిష్క హాఫ్ శారీ ఫంక్షన్ ఫొటోలు, వీడియోలు వైరల్ గా మారాయి.