Happy Birthday Movie: సెన్సార్ పూర్తి చేసుకున్న ‘హ్యాపీ బర్త్‌డే’.. ఆల్ హ్యాపీస్!

‘మత్తు వదలరా’ సినిమాతో టాలీవుడ్‌లో డైరెక్టర్‌గా తన సత్తా చాటిన రితేష్ రానా తెరకెక్కిస్తున్న లేటెస్ట్ మూవీ ‘హ్యాపీ బర్త్‌డే’. టైటిల్‌తోనే ప్రేక్షకుల్లో ఆసక్తిని క్రియేట్....

Happy Birthday Movie: సెన్సార్ పూర్తి చేసుకున్న ‘హ్యాపీ బర్త్‌డే’.. ఆల్ హ్యాపీస్!

Lavanya Tripathi Happy Birthday Movie Completes Censor Work

Updated On : July 2, 2022 / 11:34 AM IST

Happy Birthday Movie: ‘మత్తు వదలరా’ సినిమాతో టాలీవుడ్‌లో డైరెక్టర్‌గా తన సత్తా చాటిన రితేష్ రానా తెరకెక్కిస్తున్న లేటెస్ట్ మూవీ ‘హ్యాపీ బర్త్‌డే’. టైటిల్‌తోనే ప్రేక్షకుల్లో ఆసక్తిని క్రియేట్ చేసిన ఈ సినిమా ఎలాంటి కాన్సెప్ట్‌తో రాబోతుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ఇక ఈ సినిమాలో అందాల భామ లావణ్య త్రిపాఠి లీడ్ రోల్‌లో నటిస్తుండగా, వెన్నెల కిషోర్, కమెడియన్ సత్యలతో పాటు పలువురు నటీనటులు ఈ చిత్రంలో కనిపిస్తున్నారు. ఇక ఇటీవల రిలీజ్ అయిన ఈ సినిమా ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో సక్సెస్ అయ్యింది.

Happy Birthday Movie: హ్యాపీ బర్త్‌డే ట్రైలర్.. కామెడీతో అరాచకం!

అయితే తాజాగా ఈ చిత్రం సెన్సార్ పనులు కూడా పూర్తి చేసుకుని రిలీజ్‌కు రెడీ అయినట్లుగా చిత్ర యూనిట్ తెలిపింది. ఈ సినిమాకు సెన్సార్ బోర్డ్ యూ/ఏ సర్టిఫికెట్ జారీ చేసింది. గన్స్, గర్ల్స్ అండ్ గ్యాంగ్స్ అనే కాన్సెప్ట్‌తో ఈ సినిమాను కామెడీతో కూడిన యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా దర్శకుడు రితేష్ మలిచిన తీరు బాగుందని సెన్సార్ బోర్డు కితాబిచ్చినట్లుగా తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో లావణ్య పాత్ర చాలా కీలకంగా ఉంటుందని, ఆమె అన్ని ఎమోషన్స్‌ను పలికించి తన అభిమానులకు కావాల్సినంత స్టఫ్ ఇస్తుందని వారు అన్నారట.

మొత్తానికి లావణ్య త్రిపాఠి సరికొత్త కాన్సెప్ట్ మూవీతో వస్తున్న ‘హ్యాపీ బర్త్ డే’ చిత్రం ప్రేక్షకులను ఖచ్చితంగా ఆకట్టుకుంటుందని ఈ చిత్ర ట్రైలర్ రిలీజ్ సందర్భంగా దర్శకధీరుడు రాజమౌళి కూడా అన్నారు. మరి బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా ఎలాంటి రెస్పాన్స్‌ను దక్కించుకుంటుందో తెలియాలంటే ఈ సినిమా రిలీజ్ అయ్యే వరకు వెయిట్ చేయాల్సిందే. ఈ సినిమాను జూలై 8న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.