లైట్స్, కెమెరా, యాక్షన్ : షూటింగ్ లకు రెడీగా ఉన్న హీరోలు, డైరెక్టర్లు

లాక్ డౌన్ రిలాక్సేషన్ స్టార్ట్ అవ్వడంతో నెమ్మదిగా ప్రొడక్షన్ పనులు కూడా స్టార్ట్ అవుతున్నాయి. ఇక షూటింగ్ కి వెళ్లడమే లేటు అనుకుంటూ హీరోలు, డైరెక్టర్లు కూడా తమ కథలతో రెడీగా ఉన్నారు. మరి ఫుల్ బౌండెడ్ స్క్రిప్ట్ తో షూటింగ్ కి వెళ్లడానికి రెడీ అవుతున్న వాళ్లెవరు ? లాక్ డౌన్ టైమ్ ని ఫుల్ గా వాడేసుకున్నారు డైరెక్టర్లు. హీరోలు మెచ్చే కథలతో మంచి సినిమా చెయ్యడానికి రెడీ అవుతున్నారు. ప్రొడక్షన్ వర్క్ స్టార్ట్ చెయ్యడానికి పర్మిషన్‌తో పాటు షూటింగ్స్ మొదలు పెట్టడానికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో సెట్స్ మీదకు వెళ్లడానికి రెడీ అవుతున్నారు డైరెక్టర్లు.
మహేష్ బాబు – పరశురామ్ :-
వీళ్లలో ముఖ్యంగా మహేష్ బాబు – పరశురామ్ సినిమా కూడా ఉంది. మహేష్ బాబు కోస మాంచి లవ్ స్టోరీ రెడీ చేసిన పరశురామ్.. లాక్ డౌన్ టైమ్ లో సూపర్ స్టార్ కి చెప్పి ఓకే చేయించుకుని దానికి సంబందించి ఫుల్ స్క్రిప్ట్ రెడీ చేసేసుకున్నాడు. ఇక షూటింగ్ స్టార్ట్ చెయ్యడమే లేటు అంటున్నాడు పరశురామ్.
ఎన్టీఆర్ – త్రివిక్రమ్ :-
ఎన్టీఆర్ – త్రివిక్రమ్ కాంబినేషన్లో తెరకెక్కబోతున్న సినిమాకు కూడా స్క్రిప్ట్ వర్క్ మొత్తం రెడీ చేశారంట. లాక్ డౌన్ టైమ్ లో కరెక్షన్లు కూడా చేసేసిన త్రివిక్రమ్.. సినిమాని సెట్స్ మీదకు తీసుకెళ్లడమే లేటు అంటున్నాడు. ఎన్టీఆర్ ప్రజెంట్ RRR బిజీగా ఉన్నాడు. ఈ సినిమాలో ఎన్టీఆర్ షూట్ అయిపోగానే మరోసారి అరవిందసమేత సక్సెస్ ని రిపీట్ చెయ్యడానికి రెడీ అవుతున్నారు ఎన్టీఆర్ – త్రివిక్రమ్.
ప్రభాస్ – నాగాశ్విన్ :-
ప్రభాస్ – నాగాశ్విన్ కాంబినేషన్లో తెరకెక్కబోతున్న ‘ప్యాన్’ వరల్డ్ సినిమాకు కూడా కథ రెడీ అయిపోయింది. సైంటిఫిక్ థ్రిల్లర్ జానర్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రభాస్ రేంజ్ కి తగినట్టు పెద్ద స్కేల్ లో తీస్తున్నట్టు ఆల్రెడీ ఎనౌన్స్ చేశారు మేకర్స్. ఈ సినిమాకు సంబందించి ప్రభాస్‌కు జోడీగా ఆలియా భట్ ను తీసుకుందామని నాగాశ్విన్ ఫీలవుతున్నాడట. ప్రభాస్ ‘జాన్’ సినిమా కంప్లీట్ అవ్వగానే మరి ఈ స్టోరీ కూడా సెట్స్ మీదకు వెళ్లబోతోంది.
సుజిత్ – మెగాస్టార్ :-
యంగ్ డైరెక్టర్ సుజిత్ కూడా మెగాస్టార్ తో సినిమాకు స్క్రిప్ట్ తో సహా అన్నీ రెడీ చేసుకుంటున్నాడు. మళయాళ సూపర్ హిట్ మూవీ ‘లూసిఫర్’ రీమేక్ కోసం సుజిత్ ని సెలక్ట్ చేసుకున్నారు చిరంజీవి. ఈ సినిమాకు సంబందించి తెలుగు నేటివిటీకి, చిరంజీవి ఇమేజ్ కి తగినట్టు చేంజెస్ చేసి కంప్లీట్ స్క్రిప్ట్ రెడీ చేసేసి.. షూటింగ్ కి నేను రెడీ..మీదే లేట్ అంటున్నాడు సుజిత్.
పూరీ – బాలయ్య :-
డ్యాషింగ్ డైరెక్టర్ పూరీ ఇప్పుడు విజయ్ తో ‘ఫైటర్’ సినిమా చేస్తున్నాడు. అయితే లాక్ డౌన్ తో 2 నెలలు షూట్ కి బ్రేక్ రావడంతో ఈ గ్యాప్‌లో బాలయ్య కోసం స్క్రిప్ట్ రెడీ చేసేశాడట. ఆల్రెడీ ‘ఫైటర్’ 40 పర్సెంట్ కంప్లీట్ అయిపోయింది. మిగిలింది కంప్లీట్ చేసేశాక బాలయ్యతో సినిమా చెయ్యడమే. ఎందుకంటే ..ఇప్పటికే బాలయ్య కోసం కధ రెడీ చేసేశాడు పూరీ.
నాని – ఆత్రేయ :-
ఫస్ట్ సినిమా తోనే టాలీవుడ్ జనాన్ని ఎట్రాక్ట్ చేసిన డైరెక్టర్ వివేక్ ఆత్రేయ. ‘బ్రోచే వారెవరురా’ సినిమాతో అదరగొట్టిన వివేక్..నానితో సినిమా ఛాన్స్ కొట్టేశాడు. నానికి ఆల్రెడీ స్టోరీ చెప్పేసిన వివేక్ ఈ సినిమాకు సంబందించి కంప్లీట్ స్క్రిప్ట్ రెడీ చేసేసుకున్నాడట. మైత్రి మూవీ మేకర్స్ తో ఈ సినిమా తెరెకెక్కబోతోంది.
శర్వానంద్ – కిషోర్ తిరుమల :-
కిషోర్ తిరుమల ప్రస్తుతం ‘రెడ్’ సినిమా కంప్లీట్ చేసి శర్వానంద్ కోసం స్టోరీ రెడీ చేసేశాడు. 14 రీల్స్ బ్యానర్ లో తెరకెక్కబోతున్న ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్ మొత్తం కంప్లీట్ చేసి సెట్స్ మీదకెళ్లడమే లేటు అంటున్నాడు కిషోర్. శర్వా ప్రజెంట్ ‘శ్రీకారం’ సినిమాతో పాటు రీతూవర్మతో మరో సినిమా చేస్తున్నాడు. ఇలా డైరెక్టర్లు కథలు రెడీ చేసేసుకుని షూటింగ్ కి వెళ్లే రోజు కోసం వెయిట్ చేస్తున్నారు.