పూరి పాడ్‌కాస్ట్.. లాక్‌డౌన్‌లో మంచి అవకాశం..

హీరోలను మాస్ కోణంలో ఆవిష్కరించడంలో దర్శకుడు పూరీ జగన్నాథ్ స్టైలే వేరు. ఆయన సినిమాల్లో టేకింగే కాదు.. డైలాగులకు కూడా అభిమానులుంటారు. ఆయన సినిమాల్లోని డైలాగ్స్ ఎనర్జిటిక్‌గా, మన చుట్టూ ఉన్న పాత్రల స్వభావాన్ని తెలియజేసేలా ఉంటాయి. ఈ లాక్‌డౌన్ సమయంలో తన అభిమానులను, సినీ ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని పూరీ జగన్నాథ్ తన వాయిస్‌తో పాడ్‌కాస్ట్‌ను రూపొందించారు.
జీవితం గురించి, జీవితంలో గుర్తు పెట్టుకోవాల్సిన అంశాల గురించి పూరి మాటలను పాడ్‌కాస్ట్‌లో వినొచ్చు. మొత్తం 46 అంశాల గురించి ఈ పాడ్‌కాస్ట్‌లో ఉన్నాయి. స్పాటిఫై, యాపిడ్ పాడ్‌కాస్ట్‌లో పూరీ జగన్నాథ్ అనే టైప్ చేస్తే ఆయన వాయిస్‌లో చెప్పిన అంశాలను మనం వినొచ్చు. లాక్‌డౌన్ కారణంగా ఇంటికే పరిమితమైన పూరి.. సినిమాలు చూస్తూ పుస్తకాలు చదువుతూ కాలక్షేపం చేస్తున్నారు.