Love Story : పవన్ సినిమాను దాటేసిందిగా..

పాండమిక్ తర్వాత ప్రేక్షకులు థియేటర్లకు భారీ స్థాయిలో వస్తుండడంతో ‘లవ్ స్టోరీ’ మంచి వసూళ్లు రాబడుతుంది..

Love Story : పవన్ సినిమాను దాటేసిందిగా..

Vakeel Saab

Updated On : December 23, 2021 / 4:42 PM IST

Love Story: నాగ చైతన్య, సాయి పల్లవి, శేఖర్ కమ్ముల కాంబినేషన్‌లో వచ్చిన బ్యూటిఫుల్ లవ్, ఎమోషనల్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘లవ్ స్టోరీ’ బక్సాఫీస్ బరిలో ఫస్ట్ డే సత్తా చాటింది. పాండమిక్ తర్వాత ప్రేక్షకులు థియేటర్లకు భారీగా తరలి వచ్చారు. సినిమా హిట్ తెచ్చుకోవడంతో కలెక్షన్లు కూడా ఆశించిన స్థాయిలోనే వస్తున్నాయి.

Love Story Review : ‘లవ్ స్టోరీ’ రివ్యూ..

రెండు తెలుగు రాష్ట్రాలలో మొదటి రోజు రూ. 7.86 కోట్ల షేర్, వరల్డ్ వైడ్ 11.21 కోట్ల షేర్ సాధించినట్లు ట్రేడ్ వర్గాల వారు లెక్కలు చెబుతున్నారు. యూఎస్ఏలో ప్రీమియర్స్ ద్వారా 306 K డాలర్స్ వసూలు చేసిందని అంటున్నారు. ఓవర్సీస్‌లో 226 లొకేషన్లలో ‘లవ్ స్టోరీ’ రిలీజ్ చేశారు. ఈ లెక్కన పవన్ కళ్యాణ్ ‘వకీల్ సాబ్’ సినిమాను దాటేసింది చైతన్య మూవీ.

Love Story : జాతరను తలపిస్తున్న థియేటర్లు..

‘వకీల్ సాబ్’ 228 లొకేషన్లలో ప్రీమియర్ వేశారు. ఈ సినిమా 300 K డాలర్స్ రాబట్టింది. ‘వకీల్ సాబ్’ రిలీజ్ చేసినప్పుడు థియేటర్లు పూర్తి స్థాయిలో తెరుచుకుని ఉన్నాయి. కోవిడ్ సెకండ్ వేవ్ తర్వాత.. ఇప్పుడిప్పుడే జనాలు థియేటర్లకు వచ్చే సాహసం చేస్తున్నారు. అయినా ఫస్ట్ డే ‘లవ్ స్టోరీ’ ఇంత భారీ స్థాయిలో కలెక్షన్లు రాబట్టడం విశేషం.. ముందు ముందు కలెక్షన్లు మరింత పెరిగే అవకాశం ఉంది అంటున్నాయి ట్రేడ్ వర్గాలు..

Love Story : ఆ ఘనత సాధించిన ఫస్ట్ ఇండియన్ సినిమా ‘లవ్ స్టోరీ’..