Yendira Ee Panchayithi : ‘ఏందిరా ఈ పంచాయితీ’ మూవీ రివ్యూ.. విలేజి ప్రేమల మధ్య మర్డర్ మిస్టరీ..
విలేజ్ వింటేజ్ డ్రామా, సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ పాయింట్ లో ఓ విలేజ్ బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కించిన చిత్రం ఏందిరా ఈ పంచాయితీ. ఈ సినిమా నేడు అక్టోబర్ 6న రిలీజయింది.

Love suspense Story Yendira Ee Panchayithi Movie Review and Ratings
Yendira Ee Panchayithi Movie : భరత్, విషికా లక్ష్మణ్ జంటగా ప్రభాత్ క్రియేషన్స్ బ్యానర్ పై ప్రదీప్ కుమార్ నిర్మించిన సినిమా ‘ఏందిరా ఈ పంచాయితీ’. గంగాధర.టి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. విలేజ్ వింటేజ్ డ్రామా, సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ పాయింట్ లో ఓ విలేజ్ బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కించిన చిత్రం ఏందిరా ఈ పంచాయితీ. ఈ సినిమా నేడు అక్టోబర్ 6న రిలీజయింది.
కథ విషయానికొస్తే.. రామాపురం అనే గ్రామంలో ఓ ముగ్గురు స్నేహితులుంటారు. తన ఇద్దరు ఫ్రెండ్స్ తో కలిసి చిల్లర దొంగతనాలు చేస్తూనే ఎస్సై అవ్వాలని కలలు కంటాడు అభి( భరత్). ఊరి పెద్ద కూతురు యమున (విషికా)తో లవ్‌లో పడతాడు అభి. ఊరి పెద్ద మీద అటాక్, ఊర్లో కొంతమంది చనిపోవడంతో.. హీరోయిన్ తండ్రిని చంపబోయిన కేసులో అభి అరెస్ట్ అవుతాడు. ఆ తరువాత అభి జీవితంలోవచ్చిన మలుపులు ఏంటి?, అభి ఎందుకు అరెస్ట్ అయ్యాడు? మిగిలిన హత్యలు ఎవరు ఎందుకోసం చేస్తున్నారు? హీరో – హీరోయిన్స్ ప్రేమ ఏమైంది అనేది తెరపై చూడాల్సిందే.
సినిమా మొదట్లో విలేజ్ లవ్ స్టోరీతో సాగి ఇంటర్వెల్ ముందు నుంచి సస్పెన్స్, థ్రిల్లింగ్ మూమెంట్స్‌తో నడిపించాడు దర్శకుడు గంగాధర. కొన్ని సన్నివేశాలతో సినిమాను సాగదీయకుండా ముందుకు తీసుకెళ్లాడు. మాటలు, పాటలు పర్వాలేదనిపిస్తాయి. మాములు కథే అయిన కథనం కొత్తగా ట్రై చేసినట్టు చెప్పొచ్చు. మొదటి హాఫ్ లో హీరో, అతని గ్యాంగ్ చేసే చిల్లర దొంగతనాలు.. అల్లరి పనులతో అక్కడక్కడా కామెడీ ట్రై చేసారు. హీరో హీరోయిన్ల లవ్ ట్రాక్ పర్వాలేదనిపిస్తుంది. సెకండాఫ్ అంతా సీరియస్ గా సాగుతుంది. క్లైమాక్స్ లో ట్విస్టులు మెప్పిస్తాయి. ఏందిరా ఈ పంచాయితీ విలేజి సినిమా కావడంతో కెమెరా విజువల్స్ ఎంతో సహజంగా అనిపిస్తాయి. ఎడిటర్ జేపీ ఎడిటింగ్ పనితనం కూడా మెచ్చుకోవచ్చు.
Also Read : Maama Mascheendra : మామా మశ్చీంద్ర మూవీ రివ్యూ.. మూడు పాత్రలతో సుధీర్ బాబు మెప్పించాడా?
ఇక అభి పాత్రలో భరత్ అద్భుతంగా నటించాడు. చాలా వరకు కొత్త వాళ్ళైనా పర్వాలేదనిపించారు. హీరోయిన్ విషికా పల్లెటూరు అమ్మాయిలా అమాయకంగా, అందంగా కనిపించింది. తండ్రి పాత్రలో కాశీ విశ్వనాథ్ ఎమోషనల్ గా మెప్పించారు. హీరో స్నేహితుల కారెక్టర్ల కామెడీ పర్వాలేదనిపించింది. మొత్తంగా ఒక విలేజిలో జరిగే ప్రేమకథతో పాటు కొన్ని సస్పెన్స్, థ్రిల్లింగ్ మర్డర్ మిస్టరీలని జోడించారు. ఈ సినిమాకు 2.5 రేటింగ్ ఇవ్వొచ్చు.
గమనిక : ఈ రివ్యూ, రేటింగ్ కేవలం విశ్లేషకుడు అభిప్రాయం మాత్రమే