VeeraSimha Reddy Special Song : ఒకరు కాదు ఏకంగా ఇద్దరు భామలతో.. మా బావ మనోభావాలు దెబ్బతిన్నాయి అనిపించిన బాలయ్య..
ఇప్పటికే ఈ సినిమా నుంచి జై బాలయ్య, సుగుణ సుందరి అంటూ రెండు పాటలు రిలీజ్ చేయగా ఆ రెండూ మంచి కిక్ ఇచ్చాయి ప్రేక్షకులకి. ఇప్పుడు స్పెషల్ సాంగ్ అంటూ మా బావ మనోభావాలు అనే పాటని తాజాగా నేడు విడుదల చేశారు................

maa bava manobhavalu debba tinnayi special song released from VeeraSimha Reddy
VeeraSimha Reddy Special Song : బాలకృష్ణ, శృతిహాసన్ జంటగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా వీరసింహ రెడ్డి. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా సంక్రాంతికి రిలీజ్ కానున్నట్టు ఇప్పటికే ప్రకటించారు. దీంతో పాటలు వదులుతూ రోజు రోజుకి సినిమాపై అంచనాలని పెంచేస్తున్నారు చిత్ర యూనిట్. బాలయ్య గత సినిమా అఖండ సూపర్ డూపర్ హిట్ అవ్వడం, మరో పక్క అన్ స్టాపబుల్ షో దూసుకెళ్లడంతో ఫుల్ ఫామ్ లో ఉన్న బాలయ్య ఇప్పుడు వీర సింహారెడ్డి తో మరింత జోష్ ఇస్తున్నారు అభిమానులకి.
ఇప్పటికే ఈ సినిమా నుంచి జై బాలయ్య, సుగుణ సుందరి అంటూ రెండు పాటలు రిలీజ్ చేయగా ఆ రెండూ మంచి కిక్ ఇచ్చాయి ప్రేక్షకులకి. ఇప్పుడు స్పెషల్ సాంగ్ అంటూ మా బావ మనోభావాలు అనే పాటని తాజాగా నేడు విడుదల చేశారు. తమన్ ఇచ్చిన మ్యూజిక్ కి సాహితి చాగంటి, యామిని, రేణు కుమార్ పాటని అదరగొట్టేలా పాడేశారు. శేఖర్ మాస్టర్ డాన్స్ కోరియోగ్రఫీ చేశాడు. మాస్ బీట్ తో ఉన్న ఈ పాట కచ్చితంగా థియేటర్స్ లో మంచి ఊపు ఇస్తుందని అర్థమైపోతుంది.
Hari Hara Veera Mallu : ‘వీరమల్లు’ ఔరంగజేబు పాత్రలో బాలీవుడ్ నటుడు..
ఇక వీరసింహ రెడ్డి సినిమాలో మలయాళ భామ హనీ రోజ్ కూడా ఉన్నట్టు ఈ పాటతో అర్థమైపోయింది. ఈ పాటలో హనీ రోజ్ తో పాటు ఆస్ట్రేలియన్ భామ చంద్రిక రవితో బాలయ్య వీర మాస్ స్టెప్పులు వేశాడు. మా బావ మనోభావాలు దెబ్బతిన్నాయి అంటూ మరదలు పాడే పాట లాగా ఉంది ఈ సాంగ్. మొత్తానికి ఈ సారి కూడా బాలయ్య గట్టిగానే ప్లాన్ చేసినట్టు అర్ధమవుతుంది.