Ram Charan: చరణ్ బర్త్‌డేకు అదిరిపోయే గిఫ్ట్.. బాక్సులు బద్దలవ్వాల్సిందే!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్ డైరెక్షన్‌లో తన కెరీర్‌లోని 15వ చిత్రంలో నటిస్తున్నాడు. ఈ సినిమాను స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు అత్యంత భారీ బడ్జెట్‌తో ప్రొడ్యూస్ చేస్తుండటంతో ఈ సినిమాపై ఇండస్ట్రీ వర్గాలతో పాటు ప్రేక్షకుల్లోనూ అదిరిపోయే అంచనాలు క్రియేట్ అయ్యాయి. అయితే ఈ సినిమా నుండి ఇప్పటివరకు ఎలాంటి అప్డేట్స్ రాకపోవడంతో అభిమానులు తీవ్ర నిరాశకు లోనవుతున్నారు.

Ram Charan: చరణ్ బర్త్‌డేకు అదిరిపోయే గిఫ్ట్.. బాక్సులు బద్దలవ్వాల్సిందే!

Magadheera To Re-Release On Ram Charan Birthday

Updated On : February 8, 2023 / 9:31 PM IST

Ram Charan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్ డైరెక్షన్‌లో తన కెరీర్‌లోని 15వ చిత్రంలో నటిస్తున్నాడు. ఈ సినిమాను స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు అత్యంత భారీ బడ్జెట్‌తో ప్రొడ్యూస్ చేస్తుండటంతో ఈ సినిమాపై ఇండస్ట్రీ వర్గాలతో పాటు ప్రేక్షకుల్లోనూ అదిరిపోయే అంచనాలు క్రియేట్ అయ్యాయి. అయితే ఈ సినిమా నుండి ఇప్పటివరకు ఎలాంటి అప్డేట్స్ రాకపోవడంతో అభిమానులు తీవ్ర నిరాశకు లోనవుతున్నారు.

Ram Charan : మా కాలేజీ డీన్ మా నాన్న గారికి ఫోన్ చేసి తిట్టారు.. రామ్‌చరణ్!

ఈ సినిమాతో మరోసారి బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ హిట్ అందుకునేందుకు చరణ్ రెడీ అవుతున్నాడు. అయితే ఈ సినిమా నుంచి ఓ అదిరిపోయే అప్డేట్‌ను చరణ్ పుట్టినరోజు కానుకగా ఇవ్వాలని చిత్ర యూనిట్ భావిస్తోంది. ఇక ఈ సినిమా అప్డేట్‌తో పాటు మెగా ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పించే మరో గిఫ్ట్ కూడా రెడీ అవుతోందట. చరణ్ కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్‌గా నిలవడమే కాకుండా, అప్పట్లో ఇండస్ట్రీ హిట్‌గా నిలిచిన మెగా మూవీ ‘మగధీర’ను మళ్లీ ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.

Ram Charan : నా చేతిలో మొత్తం ఆరు ప్రాజెక్ట్‌లు ఉన్నాయి.. రామ్‌చరణ్!

ఈ సినిమాను చరణ్ బర్త్‌డే గిఫ్ట్‌గా రీ-రిలీజ్ చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ సినిమాకు అప్పట్లో వచ్చిన రెస్పాన్స్ ఎలాంటిదో అందరికీ తెలిసిందే. ఇప్పుడు మరోసారి ఈ సినిమాను రీ-రిలీజ్ చేస్తే, మెగా ఫ్యాన్స్ ఈ సినిమాకు పట్టం కట్టడం ఖాయమని చిత్ర వర్గాలు భావిస్తున్నాయి. మరి నిజంగానే ఈ సినిమాను చరణ్ పుట్టినరోజు కానుకగా రీ-రిలీజ్ చేస్తారా అనేది చూడాలి.