మహర్షి – రివ్యూ
ఇండియాకి తిరిగొచ్చిన రిషి.. రవిని కలిసి అతని సమస్యను పరిష్కరించడానికి ఎలా పోరాడాడు..? చివరికి రిషి, మహర్షిలా ఎలా మారాడు..? అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే..

ఇండియాకి తిరిగొచ్చిన రిషి.. రవిని కలిసి అతని సమస్యను పరిష్కరించడానికి ఎలా పోరాడాడు..? చివరికి రిషి, మహర్షిలా ఎలా మారాడు..? అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే..
శ్రీమంతుడు, భరత్ అనే నేను సినిమాలతో సమ్మర్ బ్లాక్ బస్టర్స్‌ను అందుకుని దాన్నొక సక్సెస్ సెంటిమెంట్‌గా మార్చుకున్నాడు మహేష్. దాంతో తన కెరీర్లో మైల్ స్టోన్ మూవీగా తెరకెక్కిన మహర్షి సినిమాను కూడా సమ్మర్‌లోనే రిలీజ్ చేశారు. ఈ సినిమాపై ముందునుండీ భారీ అంచనాలు ఉండడంతో, ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో టీమ్ అంతా సక్సెస్‌పై కాన్ఫిడెంట్‌గా కనిపించడం, ట్రైలర్ సైతం ప్రామిసింగ్‌గా కనిపించడంతో భారీ థియేట్రికల్ బిజినెస్ జరుపుకుని బాహుబలి తర్వాత అత్యధిక స్క్రీన్‌లలో రిలీజ్ అయిన తెలుగు సినిమాగా చరిత్ర సృష్టించింది మహర్షి.
మూడు ప్రతిష్టాత్మక ప్రొడక్షన్స్ భాగస్వామ్యంతో అన్ కాంప్రమైజ్డ్‌గా ఈ సినిమాని తెరకెక్కించాడు డైరెక్టర్ వంశీ పైడిపల్లి. మహేష్ అభిమానులతో పాటు సాధారణ ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన మహర్షి థియేటర్స్‌లోకి వచ్చాడు. మరి ముందు నుంచీ చెప్తున్నట్లు.. మహర్షి అలియాస్ రిషి కుమార్ జర్నీ ఎలా సాగిందో.. ఆ జర్నీకి ప్రేక్షకులు ఎంతవరకూ కనెక్ట్ అయ్యారో ఇప్పుడుచూద్దాం.
కథ విషయనికొస్తే.. చిన్నప్పటి నుంచి గెలుపే తన లక్ష్యంగా జీవితంలో ఎదగడమే ఏకైక గోల్‌గా పెట్టుకున్న రిషి కుమార్, చాలా తక్కువ టైమ్‌లో ఆరిజిన్ అనే అతిపెద్ద కార్పొరేట్ కంపెనీకి సీఇఓగా ఎదుగుతాడు. అనుకున్నట్లుగానే అపర కోటీశ్వరుడిగా.. సక్సెస్‌కు చిరునామాగా మారిన రిషికి తన కాలేజ్ డేస్‌ని గుర్తుచేసే ఓ సంఘటన ఎదురౌతుంది. దాంతో రిషికుమార్ మిడిల్ క్లాస్ నుంచి సిఇఓగా ఎదిగిన వైనాన్ని గుర్తుచేసుకుంటాడు. అయితే తన జర్నీలో క్లోజ్ ఫ్రెండ్ అయిన రవి గురించి రిషికి ఒక నిజం తెలుస్తుంది. దాంతో ఇండియాకి తిరిగొచ్చిన రిషి.. రవిని కలిసి అతని సమస్యను పరిష్కరించడానికి ఎలా పోరాడాడు..? చివరికి రిషి, మహర్షిలా ఎలా మారాడు..? అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.
నటీనటుల విషయానికొస్తే, ఎలాంటి పాత్ర అయినా తన ప్రజెన్స్‌తో, తన బాడీ లాంగ్వేజ్‌తో ప్రేక్షకులకు చాలా ఈజీగా కనెక్ట్ చేసే సత్తా ఉన్న సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ సినిమాలో కూడా రిషి పాత్రను కంప్లీట్‌గా ఓన్ చేసుకున్నాడు. ముఖ్యంగా కాలేజ్ బ్యాక్ డ్రాప్ ఎపిసోడ్‌లో స్టూడెంట్‌గా మహేష్ మేకోవర్ చాలా క్యూట్‌గాఉంది. అతని యాటిట్యూడ్ కూడా చాలా రిఫ్రెషింగ్‌గా ఉంది. అల్లరి నరేష్, మహేష్ అండ్ పూజా హెగ్డేల మధ్య సీన్స్ చాలా బాగా పండాయి.
కార్పొరేట్ కంపెనీ సీఈఓగా అల్ట్రా స్టైలిష్ లుక్స్‌తో ఓ హాలీవుడ్ రేంజ్ హీరోలా కనిపించాడు మహేష్. ఎమోషనల్ సీన్స్‌ని పీక్స్‌లో పండించే మహేష్.. ఈ సారి కూడా అదేరేంజ్ అవుట్ పుట్ ఇచ్చాడు.స్టోరీలో భాగంగా వచ్చిన ఫైట్స్ కూడా మహేష్ అభిమానులకు కిక్ ఇస్తాయి. కొన్నిచోట్ల లౌడ్ డైలాగ్ డెలివరీతో మహేష్ బాబు క్రియేట్ చేసిన ఇంపాక్ట్‌కి థియేటర్లలో క్లాప్స్ పడుతున్నాయి. ఈ సినిమాతో ఆల్ మోస్ట్ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన అల్లరి నరేష్‌కి మంచి స్కోప్ ఉన్న క్యారెక్టర్ దక్కింది.
పేరుకు సపోర్టింగ్ క్యారెక్టరే అయినా.. కథకి కీలకం అయిన పాత్ర కావడంతో నరేష్‌లోని మరో యాంగిల్ ప్రేక్షకులకు ఫుల్ ఫ్లెడ్జ్‌గా రివీల్ అయ్యింది. కాలేజ్ బ్యాక్ డ్రాప్ సీన్స్‌లో తన మార్క్ యాంగిల్ హావభావాలతో కూడా కూల్ కామెడీని పండించిన నరేష్ సెకండాఫ్‌లో మాత్రం ఎమోషన్స్‌ని సైతం హత్తుకునేలా జనరేట్ చెయ్యగలిగాడు. నరేష్ కెరీర్‌లో గర్వంగా చెప్పుకునే మెమరబుల్ పాత్రగా నిలిచింది రవి క్యారెక్టర్. ఇక పూజా పాత్రలో కనిపించిన పూజా హెగ్డేకి పెద్దగా స్కోప్ లేకపోయినా.. ఉన్నంతవరకూ తన గ్లామరస్ లుక్స్‌తో ఆకట్టుకుంది. ప్రకాష్ రాజ్, జయసుధల పాత్రల నిడివి తక్కువే అయినా చాలా ఇంపాక్ట్ క్రియేట్ చెయ్యగలిగారు.
రావురమేష్ పాత్ర కూడా చాలా హుందాగా ఉంది. జగపతిబాబు తనకు బాగా అలవాటైన స్టైలిష్ విలన్ పాత్రలో కనిపించి అలరించాడు. నాజర్, ముఖేష్ రిషి, కమల్ కామరాజు, పోసాని, సాయికుమార్, తనికెళ్ల భరణి, వెన్నెల కిషోర్, శ్రీనివాసరెడ్డి, పృథ్వి, మీనాక్షి దీక్షిత్, రాజీవ్ కనకాల.. ఇలా ఫేమస్ స్టార్ కాస్ట్ అంతా కూడా తమపాత్రల్లో మహర్షికి సపోర్ట్ చేశారు.
టెక్నీషియన్స్ విషయనికొస్తే ఈ సినిమాకోసం రెండేళ్లు వెయిట్ చేసిన వంశీ పైడిపల్లి స్క్రిప్ట్ పరంగా చాలా వర్క్ చేశాడు. కథ కంటే కూడా మహేష్‌ని ఎక్కువగా నమ్ముకున్నాడా.. అనే డౌట్ అక్కడక్కడా వస్తుంది. మహేష్‌ని అల్ట్రా స్టైలిష్ హీరోగా ప్రజెంట్ చెయ్యాలని, కాలేజ్ స్టూడెంట్‌గా కాస్త డిఫరెంట్ యాటిట్యూడ్ చూపించడంలో అలాగే హై స్పీడ్ షాట్స్‌తో హీరోయిక్ ఎలివేషన్స్ ఇవ్వడంలో ఫుల్ ఫ్లెడ్జ్‌గా సక్సెస్ అయ్యాడు. బర్నింగ్ సోషల్ కాజ్‌కు కమర్షియల్ టచప్ ఇచ్చి మహర్షిని ఒక భారీ సినిమాగా మలిచిన వంశీ పైడిపల్లి, స్క్రీన్‌ప్లే విషయంలో మాత్రం తడబడ్డాడు అనిపించింది. లాగ్ సీన్స్, కథకు అవసరం లేని సన్నివేశాలు కాస్త ఇబ్బంది పెట్టాయి.
చాలా లోపాలను మహేష్ కవర్ చేసినా.. కథ విషయంలో ముఖ్యంగా సెకండాఫ్ నెరేషన్‌లో మరి కాస్త కేర్ తీసుకుని ఉంటే.. మహర్షి నెక్ట్స్ రేంజ్‌కి వెళ్లేది. వంశీ పైడిపల్లి సెన్సిబిలిటీస్, ఎమోషనల్ కమాండ్ డైలాగ్ పంచింగ్ మాత్రం టాప్ క్లాస్‌లో ఉంది. ఇక ఈ సినిమా అనుకున్న దగ్గర నుంచి వంశీతో జర్నీ కంటిన్యూ చేస్తున్న దేవి శ్రీ ప్రసాద్ పాటల పరంగా కాస్త నిరుత్సాహ పరిచినా.. ఆర్ఆర్ పరంగా చాలా హార్డ్ వర్క్ చేసి మహర్షి రేంజ్ అండ్ రీచ్‌ని పెంచాడు. సీన్ కంటెంట్‌ని చాలా చోట్ల ఎలివేట్ చేసింది ఆర్.ఆర్.
k.vమోహనన్ సినిమాటోగ్రఫీ సినిమాకి ఎసెట్. ఇప్పటి వరకూ టాలీవుడ్‌లో చూడని హీరో ఎలివేషన్స్ ఈ సినిమాలో కొన్ని చోట్ల కనిపిస్తాయి. ఇక యు.ఎస్. ఎపిసోడ్ అయితే హాలీవుడ్ సినిమాని చూస్తున్న ఫీలింగ్ కలిగించింది. ఎడిటింగ్ మాత్రం ఇంకాస్త క్రిస్ప్‌గా ఉంటే బావుండేది. అశ్వినీదత్ , పి.వి.పి, దిల్ రాజు వంటి పెద్ద నిర్మాతల నిర్మాణ విలువలు టాప్ రేంజ్‌లో ఉన్నాయి. మహర్షికి అవి కూడా ఓ హైలెట్‌గా నిలిచాయి.
ఓవరాల్‌గా చెప్పాలంటే మహేష్ బాబు 25వ సినిమాగా ఓ మేనియాని క్రియేట్ చేస్తూ.. అడ్వాన్స్ బుకింగ్స్‌తోనే ఓ సునామీలా బాక్సాఫీస్‌ని ముంచెత్తిన మహర్షి ఎక్కువ శాతం మందికి రీచ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం పెద్ద సినిమాలు లేకపోవడం.. మహేష్ సక్సెస్ స్వింగ్ కూడా తోడవ్వడం లాంటివి మహర్షికి ఏ రేంజ్‌లో కలెక్షన్లు కురిపిస్తాయో చూడాలంటే వెయిట్ చెయ్యాల్సిందే.
ప్లస్..
మహేష్ బాబు
కాలేజ్ ఎపిసోడ్
ఎమోషన్స్, డైలాగ్స్
నిర్మాణ విలువలు, సినిమాటోగ్రఫీ
………
మైనస్
స్క్రీన్‌ప్లే లోపాలు
సెకండాఫ్‌లో ల్యాగ్ సీన్స్
నిడివి
కథలో రొటీన్ టచెస్