Guppedantha Manasu : జగతి, మహేంద్ర ప్రేమ కథ మొదలైంది అరకులోనా? మహేంద్ర గతం ఏంటి?
మహేంద్రని తీసుకుని రిషి, వసుధర అరకు వెళ్తారు. అక్కడికి చేరుకోగానే షాకవుతాడు మహేంద్ర. ఇక్కడికి ఎందుకు తీసుకువచ్చారని ప్రశ్నిస్తాడు. మహేంద్ర ఎందుకు షాకయ్యాడు? అరకులోయతో మహేంద్రకి ఉన్న గతం ఏంటి?

Guppedantha Manasu
Guppedantha Manasu : రిషి, వసుధర, మహేంద్రని తీసుకుని అరకు వెళ్తాడు. కారు దిగగానే మహేంద్ర ఒక్కసారి షాకవుతాడు. రిషిని అక్కడికి ఎందుకు తీసుకువచ్చావని అడుగుతాడు. ‘గుప్పెడంత మనసు’ సీరియల్‌లో ఏం జరిగింది?
రిషి, వసుధర, మహేంద్ర అరకు వెళ్తారు. మహేంద్ర జగతి జ్ఞాపకాల నుంచి కాస్త బయటపడతాడని రిషి భావిస్తాడు. కానీ అక్కడికి వెళ్లగానే మహేంద్ర ఎమోషనల్ అవుతాడు. ఇక్కడికి ఎందుకు తీసుకువచ్చావని అడుగుతాడు. ఇక్కడ ప్రశాంతంగా ఉంటుందని తీసుకువచ్చాను అంటాడు రిషి. హోటల్ రూమ్‌లోకి వెళ్తారు అంతా. తండ్రికి జగతి జ్ఞాపకాల్లోంచి కాస్త బయటకు రమ్మని చెబుతాడు రిషి. నువ్వు నీ తల్లిని మర్చిపోయి సంతోషంగా ఉన్నావా? అని రిషిని అడుగుతాడు మహేంద్ర.
Guppedantha Manasu : హనీమూన్‌కి వెళ్లిన రిషి, వసుధర.. మహేంద్రను కలసిన కొత్త క్యారెక్టర్ ఎవరు?
తల్లిని తల్చుకుంటూ రిషి బాధపడతాడు. వసుధర బాధపడొద్దని చెబుతుంది. అక్కడి ప్రకృతిని చూస్తుంటే తనకు తల్లి గుర్తుకువస్తోందని అంటాడు రిషి. తండ్రి మహేంద్రలో మార్పు రావాలని ఇక్కడికి తీసుకువస్తే అతను ఇంకా కుమిలిపోతున్నాడని బాధపడతాడు. మహేంద్ర మునుపటిలా అవుతాడా? అని ఆవేదన చెందుతాడు. వసుధర అతనికి ధైర్యం చెబుతుంది.
దేవయాని జగతి ఫోటో ముందు నిలబడి బ్రతికుండగా తన కొడుకుని ఎండీ సీట్లో కూర్చోనివ్వకుండా చేసావని.. చచ్చిపోయి కూడా తన కొడుకుకి ఆ సీటు రాకుండా చేసావని నిష్టూరమాడుతుంది. జగతి ఫోటోకి ఉన్న దండ క్రింద పడటంతో కొంపదీసి తన మాటలు జగతి వింటోందా? ఆత్మలా ఇంట్లో తిరుగుతోందా? అని భయపడుతుంది. అక్కడికి వచ్చిన శైలేంద్ర తల్లితో కాలేజీకి వెళ్తున్నా అంటాడు. ఫణీంద్ర ముందు నీ భార్యని సరిగా చూసుకో.. తర్వాత కాలేజీ చూసుకుందువుగానీ అని కొడుకుతో వ్యంగ్యంగా అంటాడు. ఇద్దరు కలిసి కాలేజీకి వెళ్తారు.
మహేంద్ర జగతి జ్ఞాపకాలతో కుమిలిపోతుంటాడు. ఎక్కడైతే జగతితో ప్రేమ మొదలైందో అదే ప్రాంతానికి వచ్చి తన జ్ఞాపకాల్లోంచి ఎలా బయటకు వచ్చేదని మహేంద్ర ఆవేదన చెందుతాడు. వసుధర, రిషి తమతో మహేంద్రని బయటకు రమ్మంటారు. తాను రాలేనని వాళ్లిద్దర్ని సరదాగా అక్కడి ప్రాంతాలు చూసి రమ్మంటాడు రిషి. ఆ తర్వాత ఏం జరిగింది? తెలియాలంటే ‘గుప్పెడంత మనసు’ సీనియల్‌లో నెక్ట్స్ ఎపిసోడ్ వరకు ఎదురుచూడాల్సిందే. ఈ సీరియల్‌లో ముకేష్ గౌడ, రక్ష గౌడ, సాయి కిరణ్, జ్యోతి రాయ్ ప్రధాన పాత్రల్లో నటిస్తారు. కాపుగంటి రాజేంద్ర ఈ సీరియల్‌ను డైరెక్ట్ చేస్తున్నారు.