Thaman : తమన్‌ను టార్గెట్‌ చేస్తున్న మహేశ్‌, మెగా ఫ్యాన్స్‌.. ఎందుకిలా..?

మ్యూజిక్ డైరెక్టర్ తమన్‌(Taman)పై మెగా ఫ్యాన్స్ ఒత్తిడి ఎక్కువవుతోంది. ఇప్పటికే మహేశ్ బాబుతో (Mahesh babu )తో గుంటూరు కారం చేసిన తమన్.. ప్రిన్స్ అభిమానులకు టార్గెట్ అయ్యారు.

Thaman : తమన్‌ను టార్గెట్‌ చేస్తున్న మహేశ్‌, మెగా ఫ్యాన్స్‌.. ఎందుకిలా..?

Taman

Updated On : July 25, 2023 / 4:39 PM IST

Fans targeting Thaman : మ్యూజిక్ డైరెక్టర్ తమన్‌ (ThamanS)పై మెగా ఫ్యాన్స్ ఒత్తిడి ఎక్కువవుతోంది. ఇప్పటికే మహేశ్ బాబుతో (Mahesh babu) తో గుంటూరు కారం (Guntur Kaaram) చేసిన తమన్.. ప్రిన్స్ అభిమానులకు టార్గెట్ అయ్యారు. తమన్‌పై రకరకాల ట్రోలింగ్స్ చేస్తున్నారు మహేశ్ ఫ్యాన్స్.. ఆ ఎపిసోడ్ అలా కొనసాగుతుండగానే గేమ్‌ఛేంజర్ (Game Changer) అప్టేడ్స్ కోసమంటూ మెగా ఫ్యాన్స్ కత్తి దూస్తున్నారు. గ్రేట్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్‌కు ఎందుకీ పరిస్థితి వచ్చింది. వెండితెర వెనుక ఏం జరుగుతోంది?

మ్యూజిక్ డైరెక్టర్ తమన్.. అగ్ర హీరోల ఫ్యాన్స్‌కు టార్గెట్‌గా మారుతున్నారు. ఇప్పటికే ప్రిన్స్ మహేష్ ఫ్యాన్స్ ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు తమన్. గుంటూరు కారం సినిమాలో తమన్ వర్క్‌పై హీరో మహేశ్ అసంతృప్తిగా ఉన్నారంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఈ తలనొప్పి ఇలా వెంటాడుతుండగా.. మరోవైపు రామ్చరణ్ ఫ్యాన్స్ ఒత్తిడి ఎక్కువవుతోంది. హీరో మహేష్‌కి, మ్యూజిక్ డైరెక్టర్ తమన్  చెడిందని సోషల్ మీడియా కోడై కూస్తోంది. తమన్, త్రివిక్రమ్ వర్క్ నచ్చక మహేష్ అసంతృప్తితో ఉన్నారని రూమర్స్ వస్తున్నాయి. ఇలాంటి టైమ్లో తమన్ కు సినిమా యూనిట్ నుంచి ఎవరూ సపోర్ట్ చేయటం లేదు.. ఎవరూ నోరు విప్పే పరిస్థితి లేదు.

Mahesh Babu – Balakrishna : రీ రిలీజ్‌కి సిద్దమవుతున్న మహేష్, బాలయ్య సూపర్ హిట్ సినిమాలు..

ఇదే సమయంలో మహేశ్ ఫ్యాన్స్ కూడా సోషల్ మీడియాలో తమన్ను ఆడుకుంటున్నారు.. ఇలాంటి పరిస్థితిలో సినిమా నుంచి తమన్ తప్పుకుంటాడానే న్యూస్ కూడా వచ్చింది. టాలీవుడ్‌లో మంచి మ్యూజిక్ డైరెక్టర్‌గా ఇప్పటికే గుర్తింపు తెచ్చుకున్న తమన్‌పై మహేశ్ అభిమానులు అసంతృప్తి చెందడంతో.. ఎలా సరిదిద్దాలా.. అనేది ఇప్పుడు చాలెంజ్‌గా మారింది. ఇది ఇలా రగులుతుండగానే.. మరోవైపు మెగా ఫ్యాన్స్ కూడా తమన్ను టార్గెట్ చేస్తున్నారు.

గేమ్ చేంజర్ సినిమాకు సంబంధించిన ఒక అప్డేట్ కూడా రావడం లేదని మెగా ఫ్యాన్స్ అసంతృప్తి చెందుతున్నారని చెబుతున్నారు. రామ్‌చరణ్ అభిమానులు ఎన్నో అంచనాలు పెట్టుకున్న సినిమా గేమ్ ఛేంజర్. అలాంటి సినిమాలో తమన్ మ్యూజిక్‌పై డిస్కషన్ పెద్ద ఎత్తున జరుగుతోంది.. తమన్ ఎలాంటి మ్యూజిక్ ఇస్తాడా అని ఫ్యాన్స్ ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. మ్యూజిక్ సంబంధించిన ఏదైనా ట్యూన్ టీజర్‌గా రిలీజ్ చేస్తే బాగుంటుందని అనుకుంటున్నారు చరణ్ ఫ్యాన్స్.. అటు పవన్ O.G, ఇటు చరణ్ గేమ్ ఛేంజర్కు తమన్ మ్యూజిక్ పై ఫ్యాన్స్ ఒత్తిడి మామూలుగా లేదంటున్నారు.

Harish Kalyan : టాలీవుడ్ హీరోలు చేసే ఆ పని ప్రతిఒక్కరికి ఆదర్శం.. ఇటీవల అల్లు అర్జున్ గారు..