మహేష్ మాస్ కటౌట్.. సరిలేరు నీకెవ్వరు

మహేష్ బిగ్గెస్ట్ ఎంటర్‌టైనర్ సరిలేరు నీకెవ్వరు సినిమా సంక్రాంతి కానుకగా (జనవరి 11, 2020)న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాకు అనీల్ రావిపూడి దర్శకత్వం వహించారు. అయితే రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో సూపర్ స్టార్ అభిమానులు థియేటర్స్ ని అందంగా ముస్తాబు చేస్తున్నారు.
ఈ క్రమంలో భీమవరంలో మహేష్ బాబు భారీ కటౌట్ ని (50 అడుగుల) ఏర్పాటు చేశారు. గతంలోను మహేష్ కోసం భారీ కటౌట్స్ ఎన్నోసార్లు ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. సరిలేరు నీకెవ్వరు చిత్రంలో రష్మిక కథానాయికగా నటించగా, విజయశాంతి ప్రత్యేక పాత్రలో కనిపించనున్నారు. తమన్నా స్పెషల్ సాంగ్‌లో మెరవనుంది.
అంతేకాదు ఈ సినిమాకి సంబంధించి యూట్యూబ్ లో లిరికల్ సాంగ్స్, వీడియో సాంగ్స్, ఇంటర్వ్యూలు ఇలా పలు రకాలుగా అన్నీ వరుసగా 1, 5, 10 స్థానాల్లో నిలిచాయి. ఈ విషయాన్ని మేకర్స్ ఆనందంగా ప్రకటించారు.