Guntur Kaaram : బాబుతో పాటు అంతా స్పెషల్ ఫ్లైట్‌లోనే.. గుంటూరుకి ఘాటు ఎక్కించి..

గుంటూరులో మొదటిసారి ఈ రేంజ్ లో భారీ ప్రీ రిలీజ్ ఈవెంట్ పెట్టడంతో మహేష్ అభిమానులతో పాటు అనేకమంది ప్రజలు వచ్చారు.

Guntur Kaaram : బాబుతో పాటు అంతా స్పెషల్ ఫ్లైట్‌లోనే.. గుంటూరుకి ఘాటు ఎక్కించి..

Mahesh Babu and Guntur Kaaram Movie unit Went to Guntur Pre Release Event in Special Flight Yesterday Pics goes Viral

Updated On : January 10, 2024 / 7:53 AM IST

Guntur Kaaram : త్రివిక్రమ్(Trivikram) దర్శకత్వంలో మహేష్ బాబు(Mahesh Babu) హీరోగా తెరకెక్కిన గుంటూరు కారం సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12న రాబోతుంది. ఇప్పటికే రిలీజ్ చేసిన ట్రైలర్, సాంగ్స్ తో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. గుంటూరు కారం సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న సాయంత్రం గుంటూరులో ఘనంగా జరిగింది. చిత్రయూనిట్ అంతా ఈ ఈవెంట్లో పాల్గొన్నారు. గుంటూరులో మొదటిసారి ఈ రేంజ్ లో భారీ ప్రీ రిలీజ్ ఈవెంట్ పెట్టడంతో మహేష్ అభిమానులతో పాటు అనేకమంది ప్రజలు వచ్చారు.

అయితే ఈ ఈవెంట్ కి మహేష్ బాబు తో పాటు చిత్రయూనిట్ లో ముఖ్య వ్యక్తులు అంతా కలిసి ఒకే ఫ్లైట్ లో వెళ్లారు. మహేష్ బాబు, త్రివిక్రమ్, మీనాక్షి చౌదరి, శ్రీలీల, తమన్నా, నిర్మాత నాగవంశీ, నిర్మాత చినబాబు, తమన్, దిల్ రాజు.. వీరంతా కలిసి ఒకే స్పెషల్ ఫ్లైట్ లో బేగంపేట ఎయిర్ పోర్ట్ నుంచి గన్నవరం వెళ్లి అక్కడి నుంచి కార్లలో గుంటూరుకి వెళ్లారు. దీంతో ఫ్లైట్ లో కలిసి వెళ్తుండగా దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

Mahesh Babu and Guntur Kaaram Movie unit Went to Guntur Pre Release Event in Special Flight Yesterday Pics goes Viral

Also Read : Lal Salaam : సంక్రాంతి బరి నుండి తప్పుకున్న రజినీకాంత్.. రవితేజతో పోటీకి రెడీ..

ఫ్లైట్ లో గుంటూరు కారం దిగిన పలు ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మొత్తానికి చిత్రయూనిట్ అంతా గుంటూరు వెళ్లి గుంటూరు కారం ఘాటు చూపించి వచ్చారు. రాత్రికి మళ్ళీ అంతా అదే స్పెషల్ ఫ్లైట్ లో హైదరాబాద్ కి తిరిగి వచ్చారు.

Mahesh Babu and Guntur Kaaram Movie unit Went to Guntur Pre Release Event in Special Flight Yesterday Pics goes Viral