మహేష్ బాబు ‘గ్యాంగ్ డిన్నర్’..

Mahesh Babu Family: టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేష్ బాబు ప్రొఫెషన్‌తో పాటు పర్సనల్ లైఫ్‌కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారో కొత్తగా చెప్పక్కర్లేదు. పిల్లలు గౌతమ్, సితారలతో వీలైనంత ఎక్కువ టైం స్పెండ్ చేయడానికి ప్రయత్నిస్తుంటారు. పిల్లలతో కలిసి తాను పిల్లాడిలా మారిపోయి ఎంజాయ్ చేస్తుంటారు.. అలాగే వీలు దొరికినప్పుడల్లా వారితో కలిసి విదేశీ యాత్రలకు వెళుతుంటాడు. ఇటీవల మహేష్ కుటుంబ సభ్యులతో కలిసి టూర్‌కి వెళ్లిన సంగతి తెలిసిందే.
ఆ వెకేషన్‌కు సంబంధించిన ఫొటోలను మహేష్ ఎప్పటికప్పుడు సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటున్నారు. ఓ రెస్టారెంట్‌లో పిల్లలు సితార, గౌతమ్‌లతో కలిసి డిన్నర్ చేస్తున్న ఫొటోను షేర్ చేస్తూ.. ‘‘మా గ్యాంగ్‌తో డిన్నర్’’ అని కామెంట్ చేశారు. అలాగే సితార పాప కూడా తండ్రి, అన్నయ్యతో కలిసి ఉన్న ఫొటోను పోస్ట్ చేసింది. మహేష్ కొత్త సినిమా ‘సర్కారు వారి పాట’ షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది.