గుంటూరు కారం ట్విట్టర్ రివ్యూ.. ఆడియన్స్ టాక్ ఏంటి..?

గుంటూరు కారం ట్విట్టర్ రివ్యూ.. ఆడియన్స్ టాక్ ఏంటి..?

Mahesh Babu Guntur Kaaram Twitter Review and public talk

Updated On : January 12, 2024 / 10:39 AM IST

Guntur Kaaram Twitter Review : సూప‌ర్ స్టార్ మ‌హేశ్ బాబు పూర్తి మాస్ అవతార్ లో కనిపిస్తూ ఆడియన్స్ ముందుకు వస్తున్న సినిమా ‘గుంటూరు కారం’. త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్కిన ఈ చిత్రం నేడు జ‌న‌వ‌రి 12న ఆడియన్స్ ప్రపంచవ్యాప్తంగా అత్యధిక థియేటర్స్ లో రిలీజ్ అయ్యింది. ఆల్రెడీ ప్రీమియర్ అండ్ మార్నింగ్ షోలు పడిపోవడంతో.. అభిమానులు తమ రివ్యూలను ట్విట్టర్ ద్వారా తెలియజేస్తున్నారు.

Also read : ‘హనుమాన్’ రివ్యూ.. జై హనుమాన్ అనాల్సిందే.. గూస్‌బంప్స్ గ్యారెంటీ..

సినిమా చూసిన వారంతా మహేష్ బాబు వన్ మ్యాన్ షో అంటున్నారు. ఫస్ట్ హాఫ్ అంతా చాలా ఎంటర్టైన్ గా సాగిందని, సెకండ్ హాఫ్ లో ఎమోషన్స్, క్లైమాక్స్ చాలా బాగుందని చెబుతున్నారు.

ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫ్ చాలా బాగుందని, మొదటి ఫ్రేమ్ నుంచి మహేష్ ఫుల్ ఆన్ ఎనర్జీతో సినిమాని ముందుకు తీసుకు వెళ్లారని చెప్పుకొస్తున్నారు. సెకండ్ ఎమోషన్స్ అండ్ యాక్షన్ తో ఆకట్టుకున్నట్లు పేర్కొంటున్నారు.

సెకండ్ హాఫ్ సూపర్ అంటున్నఫ్యాన్స్.. కుర్చీ మడతపెట్టి సాంగ్, క్లైమాక్స్ ఎమోషన్ సీన్స్ పేకాట ఆడేశాయి అంటూ చెప్పుకొచ్చారు.

మహేష్ బాబు మాస్ యాక్టింగ్ ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పిస్తుందని చెప్పొస్తున్నారు. ఫస్ట్ హాఫ్ ఫ్యాన్స్ ని ఆకట్టుకుంటే, సెకండ్ హాఫ్ ఫ్యామిలీని ఆకట్టుకుంటుందని చెప్పుకొస్తున్నారు.