షాక్ ఇచ్చిన మహేష్ బాబు.. సినిమా ఆగిపోయిందట!

  • Published By: vamsi ,Published On : March 4, 2019 / 05:23 PM IST
షాక్ ఇచ్చిన మహేష్ బాబు.. సినిమా ఆగిపోయిందట!

Updated On : March 4, 2019 / 5:23 PM IST

ఒక స్టార్ హీరో.. ఒక స్టార్ డైరెక్టర్.. ఆల్మోస్ట్ సెట్స్ పైకి వెళ్లాల్సిన ప్రాజెక్ట్. కానీ ఆగిపోయింది. రంగస్థలం సినిమాతో బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టిన డైరెక్టర్ సుకుమార్ మహేష్ బాబు హీరోగా మైత్రి మూవీస్ బ్యానర్‌లో సుక్కూ తర్వాతి సినిమా ఉంటుందని గత ఏడాది అక్టోబర్ లో అధికారికంగా ప్రకటించారు.

ప్రి ప్రొడక్షన్ వర్క్ జరుగుతోందని అప్పుడే నిర్మాతలు చెప్పారు. అయితే సడెన్‌గా సీన్ మారిపోయింది. మహేష్ బాబు ప్లేస్ లో అల్లు అర్జున్ ఎంట్రీ ఇచ్చేశాడు. మహాశివరాత్రి సందర్భంగా మైత్రీ మూవీస్ మేకర్స్‌ బన్నీతో సినిమా చేస్తున్నాడు సుకుమార్ అంటూ ప్రకటన కూడా చేసేసింది. అయితే మహేష్ తో సినిమా తర్వాత ఇది ఉంటుందని అందరూ భావించారు. కానీ ఇక్కడే మహేష్ బాబు ట్విస్ట్ ఇచ్చాడు.
Also Read : కన్నడలో డబ్ అయిన రంగస్థలం

ట్విట్టర్ వేదికగా ప్రిన్స్ మహేష్ బాబు అందరికీ షాక్ ఇచ్చాడు. క్రియేటివ్ డిఫరెన్సెస్ కారణంగా సుకుమార్‌తో సినిమా చేయడం లేదని చెప్పాడు. కొత్త ప్రాజెక్ట్ అనౌన్స్ చేసిన సుక్కూకి ప్రిన్స్ ఆల్ ది బెస్ట్ చెప్పాడు. ఈ సందర్భంగా సుకుమార్‌పై సూపర్ స్టార్ ప్రశంసలు గుప్పించాడు. సుకుమార్ అంటే నాకెంతో గౌరవమన్న ప్రిన్స్.. 1 నేనొక్కడినే సినిమా ఓ క్లాసిక్‌గా మిగిలిపోతుందని అన్నాడు. ఆ సినిమా కోసం పని చేసిన ప్రతి క్షణాన్ని ఎంజాయ్ చేశానంటూ ట్వీట్ చేశాడు. అయితే ఇందులో చిన్న కన్ఫ్యూజన్ ఏంటంటే.. మైత్రీ మూవీస్ బ్యానర్లో సుకుమార్‌ దర్శకత్వంలో మహేశ్ హీరోగా సినిమా రూపొందాల్సి ఉండగా.. ప్రిన్స్ స్థానంలో బన్నీ ఎంటరయ్యాడా..? లేదంటే ఈ స్టోరీ వేరేనా..? అనే అనుమానం వ్యక్తం అవుతుంది.
Also Read : క్యాష్ చేసుకోండి : అభినంద‌న్ బ‌యోపిక్ తీస్తున్నారు