Mahesh Babu: లండన్ లో ఫ్యామిలీ వెకేషన్ ని ఎంజాయ్ చేస్తున్న మహేష్..వైరల్ అవుతున్న పిక్స్!

టాలీవుడ్ లో వరుస సినిమాలు, కమర్షియల్ యాడ్స్ చేస్తూ ఫుల్ బిజీగా ఉండే సూపర్ స్టార్ మహేష్ బాబు సమయం దొరికినప్పుడల్లా ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేస్తుంటాడు. ఇటీవల SSMB28 షూటింగ్ స్టార్ట్ చేసిన ఈ హీరో, సినిమా మొదటి షెడ్యూల్ ని పూర్తి చేశాడు. మరో షెడ్యూల్ మొదలు కావడానికి కొంత సమయం ఉండడంతో.. ఫ్యామిలీ వెకేషన్ కి వెళ్ళాడు.

Mahesh Babu: లండన్ లో ఫ్యామిలీ వెకేషన్ ని ఎంజాయ్ చేస్తున్న మహేష్..వైరల్ అవుతున్న పిక్స్!

Mahesh enjoying his family vacation in London

Updated On : October 27, 2022 / 9:37 PM IST

Mahesh Babu: టాలీవుడ్ లో వరుస సినిమాలు, కమర్షియల్ యాడ్స్ చేస్తూ ఫుల్ బిజీగా ఉండే సూపర్ స్టార్ మహేష్ బాబు సమయం దొరికినప్పుడల్లా ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేస్తుంటాడు. ఇటీవల SSMB28 షూటింగ్ స్టార్ట్ చేసిన ఈ హీరో, సినిమా మొదటి షెడ్యూల్ ని పూర్తి చేశాడు. మరో షెడ్యూల్ మొదలు కావడానికి కొంత సమయం ఉండడంతో.. ఫ్యామిలీ వెకేషన్ కి వెళ్ళాడు.

Mahesh Babu : మరో మంచిపనికి శ్రీకారం చుట్టిన మహేష్ బాబు.. బుర్రిపాలెంలో డిజిటల్ లెర్నింగ్..

మహేష్, నమ్రత మరియు పిల్లలతో కలిసి లండన్‌లో ఫ్యామిలీ వెకేషన్‌ను ఎంజాయ్ చేస్తున్నాడు. లండన్ వీధుల్లో గౌతమ్, సితార లతో కలిసి మహేష్ ఫోటోలకు ఫోజులిస్తూ దిగిన పిక్స్ ని నమ్రత సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ ఫోటోలో.. మహేష్ క్లీన్ షేవ్, లాంగ్ హెయిర్ తో స్టైలిష్ మేకోవర్‌లో కనిపిస్తున్నాడు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి.

దీంతో త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రంలో మహేష్ సరికొత్తగా కనిపించబోతున్నట్లు తెలుస్తుంది. కాగా ఈ సినిమాలో మహేష్ బాబు సరసన పూజ హెగ్డే మరోసారి మెరవనుండగా, భీమ్లా నాయక్ ఫేమ్ సంయుక్త మీనన్ ఒక ముఖ్య పాత్రలో కనిపించనుంది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై నిర్మిస్తున్న ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నాడు.