సినీ కార్మికులకు మలబార్ గోల్డ్ ఛారిటీ ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులు పంపిణీ..

  • Published By: Mahesh ,Published On : April 29, 2020 / 06:03 AM IST
సినీ కార్మికులకు మలబార్ గోల్డ్ ఛారిటీ ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులు పంపిణీ..

Updated On : April 29, 2020 / 6:03 AM IST

కరోనా మహమ్మారి కారణంగా లాక్‌డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో పేద, మధ్య తరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సినీ రంగంలో వివిధ శాఖల్లో రోజువారీ కూలికి పనులు చేస్తున్న వారి పరిస్థితి దయనీయంగా తయారైంది. తాజాగా వారిని ఆదుకోవడానికి మలబార్ గోల్డ్ ఛారిటీ వారు ముందుకొచ్చి తమ వంతు సాయమందించారు.

ఫిలిం నగర్ అంబేడ్కర్ బస్తీలో సినీ కార్మిక కుటుంబాలకు మరియు నిరు పేద కుటుంబాలకు మలబార్ గోల్డ్ ఛారిటీ ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బంజారాహిల్స్ ఏ ఎస్ఐ ప్రేమ్ కుమార్,మలబార్ గోల్డ్ ఛారిటీ ప్రతినిధి రెనా చారి, కుమార్, వెంకటేష్, గోపాల్ పాల్గొన్నారు. ఆపదలో ఆదుకుని ఆకలి తీర్చిన మలబార్ గోల్డ్ ఛారిటీ వారికి సినీ కార్మిక కుటుంబాలు, నిరుపేద కుటుంబాల వారు కృతజ్ఞతలు తెలిపారు.