Video: మలైకా అరోరా ప్రాణాయామం.. ఊపిరితిత్తుల సామర్థ్యం పెంచుతుంది

Video: మలైకా అరోరా ప్రాణాయామం.. ఊపిరితిత్తుల సామర్థ్యం పెంచుతుంది

Malaika

Updated On : May 4, 2021 / 7:54 PM IST

Malaika Arora’s Technique: మలైకా అరోరా ఫిట్‌నెస్ అందరినీ ఆకర్షిస్తుంది. మలైకా ఖచ్చితమైన టోన్డ్ బాడీ వెనుక ఆమె వ్యాయామం, యోగా ఉన్నాయనే విషయం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మలైకా తన ఫిట్‌నెస్ చిట్కాలను రోజు అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. ఇప్పుడు మలైకా యోగసాన్ అతి ముఖ్యమైన ప్రాణాయామంకు సంబంధించిన వీడియోని పంచుకున్నారు.

మలైకా అరోరా తన వీడియోను షేర్ చేయగా.. అందులో ఆరోగ్యకరమైన శ్వాస పద్ధతిని చూపించారు. ఎన్నిసార్లు మరియు ఎంతసేపు చేయాలి అనే పూర్తి వివరాలను కూడా అందులో చూపించింది మలైకా. ‘మన జీవితంలో భాగమైన ఈ కష్ట సమయంలో ప్రాణాయామం చేయడం చాలా ముఖ్యం.

ప్రాణాయామం సులభమైన పద్ధతులు మీ రోగనిరోధక శక్తి మరియు ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని పెంచి ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి. అని అందులో చెప్పుకొచ్చింది. అంతేకాదు.. ప్రాణాయామం ఒత్తిడిని కూడా తగ్గిస్తుంది.

కరోనా సమయంలో ఎక్కువగా శ్వాస సమస్యలు వస్తుండగా.. మందగించిన శ్వాస వ్యవస్థను మెరుగుపరుచుకోవడానికి, మాడ్యులేట్ చేయడం, నాడీ వ్యవస్థను ప్రేరేపించేందుకు ప్రాణయామం మంచిదని చెబుతున్నారు.

 

 

View this post on Instagram

 

A post shared by Malaika Arora (@malaikaaroraofficial)