Arya Dhayal : మలయాళం యంగ్ సింగింగ్ సెన్సేషన్.. రౌడీ హీరో తమ్ముడి కోసం తెలుగులో..
బేబీ సినిమా యూనిట్ ఆర్య దయాల్ తో ఈ సినిమాలో ఓ ప్రమోషన్ సాంగ్ పాడించారు. దీంతో ఆర్య తెలుగు ఫ్యాన్స్ ఈ పాట కోసం ఎదురు చూస్తున్నారు. ఈ పాటని కళ్యాణ్ చక్రవర్తి రాయగా, విజయ్ బుల్గానిన్ సంగీత దర్శకత్వంలో....................

Malayalam young singer Arya Dhayal singing in telugu for baby movie
Arya Dhayal : విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ హీరోగా, వైష్ణవి చైతన్య హీరోయిన్ గా తెరకెకెక్కుతున్న సినిమా బేబీ. కలర్ ఫోటో సినిమా నిర్మాత సాయి రాజేష్ ఈ సినిమాని డైరెక్టర్ గా తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటికే పలు సాంగ్స్, టీజర్ రిలీజ్ అయి ప్రేక్షకులని మెప్పించాయి. ఈ సినిమా ప్యూర్ లవ్ స్టోరీ అని టీజర్ చూస్తూనే తెలిసిపోతుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది బేబీ సినిమా.
తాజాగా ఈ సినిమా కోసం ఓ ప్రమోషనల్ సాంగ్ షూట్ చేశారు. అయితే ఈ పాటని మలయాళం యంగ్ సెన్సేషన్ ఆర్య దయాల్ పాడింది. ప్రమోషన్ షూట్ లో కూడా పాల్గొంది. చిత్రయూనిట్ దీనిని అధికారికంగా ప్రకటించారు. మలయాళంలో ఇప్పుడిప్పుడే సింగర్ గా ఎదుగుతున్న ఆర్య దయాల్ కి మంచి పేరు ఉంది. తన బ్యాండ్ తో ఇచ్చే ప్రైవేట్ షోస్ కి జనాలు బాగా వస్తారు. యూట్యూబ్, సోషల్ మీడియా ద్వారా ఆర్య దయాల్ ఇక్కడ కూడా పాపులర్ అయి అభిమానులని సంపాదించుకుంది.
Bhool Bhulaiyaa 2 : ఆ హిట్ సినిమాకు మరో సీక్వెల్ అనౌన్స్ చేసిన కార్తీక్ ఆర్యన్.. హిట్ కోసమేనా??
దీంతో బేబీ సినిమా యూనిట్ ఆర్య దయాల్ తో ఈ సినిమాలో ఓ ప్రమోషన్ సాంగ్ పాడించారు. దీంతో ఆర్య తెలుగు ఫ్యాన్స్ ఈ పాట కోసం ఎదురు చూస్తున్నారు. ఈ పాటని కళ్యాణ్ చక్రవర్తి రాయగా, విజయ్ బుల్గానిన్ సంగీత దర్శకత్వంలో కంపోజ్ చేశారు. త్వరలోనే ఈ పాటని రిలీజ్ చేయనున్నారు. ఇక బేబీ సినిమాను సమ్మర్ రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు చిత్రయూనిట్.
Malayalam Singing Sensation @AryaDhayal to make her debut in Telugu with the 2nd Single of #BabyTheMovie
Joins Team for a promotional song shoot today in HYD. @VijaiBulganin ?#KalyanChakravarthy ✍️@sairazesh ?@SKNonline ?@ananddeverkonda @viraj_ashwin @iamvaishnavi04 pic.twitter.com/cmQHxEpPF2
— BA Raju's Team (@baraju_SuperHit) March 1, 2023