Malli Pelli Ott Release Date : అఫీషియల్ : రెండు ఓటీటీల్లో నరేశ్, పవిత్రల ‘మళ్ళీ పెళ్లి’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?
టాలీవుడ్ సీనియర్ నటులు నరేశ్(Naresh), పవిత్రా లోకేశ్(Pavithra Lokesh) జంటగా నటించిన చిత్రం 'మళ్ళీ పెళ్లి'(Malli Pelli). నిర్మాత, డెరెక్టర్ ఎంఎస్ రాజు ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు.
![Malli Pelli Ott Release Date : అఫీషియల్ : రెండు ఓటీటీల్లో నరేశ్, పవిత్రల ‘మళ్ళీ పెళ్లి’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..? Malli Pelli Ott Release Date : అఫీషియల్ : రెండు ఓటీటీల్లో నరేశ్, పవిత్రల ‘మళ్ళీ పెళ్లి’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?](https://10tv.in/wp-content/uploads/2023/06/Malli-Pelli.jpg)
Malli Pelli
Malli Pelli Ott Release : టాలీవుడ్ సీనియర్ నటులు నరేశ్(Naresh), పవిత్రా లోకేశ్(Pavithra Lokesh) జంటగా నటించిన చిత్రం ‘మళ్ళీ పెళ్లి'(Malli Pelli). నిర్మాత, డెరెక్టర్ ఎంఎస్ రాజు ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. వీరిద్దరి పరిచయం. పెళ్లి విషయాలనే కథగా తీసుకుని సినిమాని తెరకెక్కించడంతో విడుదలకు ముందే ఎంతో హైప్ క్రియేట్ చేసింది. మే 26న ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈ సినిమా. అయితే.. అంచనాలను అందుకోలేకపోయింది.
Malli Pelli : నరేష్ ‘మళ్ళీ పెళ్లి’ మూవీ మొదటిరోజు ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?
థియేటర్లలో ఈ సినిమాను మిస్ అయిన వాళ్లు ఈ చిత్రం ఎప్పుడెప్పుడు ఓటీటీలో విడుదల అవుతుందా అని ఎదరుచూస్తున్నారు. అలాంటి వారికి శుభవార్త. ఈ సినిమాని ఓటీటీలో ఎప్పుడు స్ట్రీమింగ్ చేయనున్నారో చెప్పేశారు. శుక్రవారం అంటే జూన్ 23న ప్రముఖ ఓటీటీలు అయిన అమెజాన్ ప్రైమ్ వీడియో, ఆహా రెండింటిలో ఈ సినిమా స్ట్రీమింగ్ కానున్నట్లు చిత్ర బృందం తెలియజేసింది. థియేటర్లలో పెద్దగా అలరించని సినిమాలు సైతం ఓటీటీలో రికార్డును సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. మరీ నరేశ్, పవిత్రల మళ్ళీ పెళ్లి ఓటీటీ అభిమానులను ఎంత మేరకు ఆకట్టుకుంది అన్నది చూడాలి.
It’s time to experience the magic of true love on small Screens😍#MALLIPELLI PREMIERES ON JUNE 23rd only on @PrimeVideoIN& @ahavideoIN💥#MalliPelliOnPrime#MalliPelliOnAha@ItsActorNaresh #PavitraLokesh @MSRajuOfficial @vanithavijayku1 @sureshbobbili9 @VKMovies_ @adityamusic pic.twitter.com/fZRUC9ojnc
— MS Raju (@MSRajuOfficial) June 21, 2023
Lust Stories 2 Trailer : లస్ట్ స్టోరీస్ 2 ట్రైలర్ రిలీజ్.. తమన్నా, విజయ్ వర్మ రొమాన్స్!
అనన్య నాగళ్ళ, వనిత విజయ్ కుమార్, జయసుధ, అన్నపూర్ణమ్మ ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటించారు. ఇటీవల కన్నుమూసిన శరత్ కుమార్ (Sarath Kumar) ఈ చిత్రంలో ముఖ్యమైన పాత్రను పోషించారు. ఇదే ఆయనకు చివరి సినిమా. ఈ చిత్రాన్ని హీరో నరేష్ తన సొంత బ్యానర్ విజయ్ కృష్ణ సంస్థలో నిర్మించగా, సురేష్ బొబ్బిలి సంగీతాన్ని అందించారు.
Adipurush : ఆదిపురుష్ టీంని నిలబెట్టి కాల్చేయాలి.. శక్తిమాన్ నటుడు ముకేష్ ఖన్నా..