మమ్ముట్టి ‘మామాంగం’ – టీజర్ (తెలుగు) : ‘చరిత్రలో అలాంటి యోధుడు లేడు.. ఇక రాడు’..

మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి నటిస్తున్న హిస్టారికల్ డ్రామా.. ‘మామాంగం’ (హిస్టరీ ఆఫ్ ది బ్రేవ్).. తెలుగు  టీజర్ విడుదల..

  • Published By: sekhar ,Published On : October 4, 2019 / 06:15 AM IST
మమ్ముట్టి ‘మామాంగం’ – టీజర్ (తెలుగు) : ‘చరిత్రలో అలాంటి యోధుడు లేడు.. ఇక రాడు’..

Updated On : October 4, 2019 / 6:15 AM IST

మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి నటిస్తున్న హిస్టారికల్ డ్రామా.. ‘మామాంగం’ (హిస్టరీ ఆఫ్ ది బ్రేవ్).. తెలుగు  టీజర్ విడుదల..

మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి నటిస్తున్న హిస్టారికల్ డ్రామా.. ‘మామాంగం’ (హిస్టరీ ఆఫ్ ది బ్రేవ్).. కావ్య ఫిలింస్ బ్యానర్‌పై వేణు కున్నప్పిల్లి నిర్మిస్తుండగా, ఎమ్.పద్మ కుమార్ డైరెక్ట్ చేస్తున్నాడు.. ఈ సినిమాను తెలుగులోనూ రిలీజ్ చెయ్యనున్నారు. రీసెంట్‌గా ‘మామాంగం’ తెలుగు  టీజర్ విడుదల చేశారు. టీజర్ చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంది. కేవలం వాయిస్ ఓవర్‌తో సాగే ఈ టీజర్ ద్వారా సినిమా నేపథ్యం అర్థమవుతుంది.

1695 వ శతాబ్ధంలో జరిగిన యదార్థ సంఘటనల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతుంది. ‘మన చరిత్రలో మునుపెన్నడు తనలాంటి యోధుడు లేడు.. ఇకరాడు’.. అంటూ మమ్ముట్టి గురించి ఇంట్రడక్షన్ ఇవ్వడం, మమ్ముట్టి రోమాలు నిక్కబొడుచుకునే స్టంట్స్ చెయ్యడం చాలా బాగుంది. మనోజ్ పిళ్లై విజువల్స్, సంచిత్ బల్హారా, అంకిత్ బల్హారా ఇచ్చిన ఆర్ఆర్, శ్యామ్ కౌషల్ యాక్షన్ సీక్వెన్సెస్ హైలెట్ అయ్యాయి. భారీ బడ్జెట్‌తో ‘మామాంగం’ రూపొందుతుంది.

Read Also : రజినీ ‘దర్బార్’ : గుమ్మడికాయ కొట్టేశారు!

ఈ ఏడాది చివర్లో విడుదల చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నారు. ప్రాచీ తెహ్లాన్, ఉన్ని ముకుందన్, సిద్దిఖీ, అచ్యుతన్, అను సితార, తరుణ్ అరోరా, సుదేవ్ నాయర్, మణి కందన్, సుదేవ్ నాయర్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ‘మామాంగం’ చిత్రాన్ని, మలయాళంతో పాటు, హిందీ, తెలుగు, తమిళ్ భాషల్లోనూ రిలీజ్ చెయ్యనున్నారు. కెమెరా : మనోజ్ పిళ్లై, సంగీతం : ఎమ్.జయచంద్రన్, బ్యాగ్రౌండ్ స్కోర్ : సంచిత్ బల్హారా, అంకిత్ బల్హారా, ఎడిటింగ్ : రాజా మొహమ్మద్.