Manchu Vishnu – Manoj : అన్నదమ్ములు ఇద్దరూ ఒకేసారి పోస్టులు.. ఏంది బ్రో కండలు అలా పెంచారు ఇద్దరూ.. బ్యాక్ టు యాక్షన్..?

తాజాగా అన్నదమ్ములు మనోజ్, విష్ణు.. ఇద్దరూ ఆల్మోస్ట్ ఒకే టైంకి తమ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు.

Manchu Vishnu – Manoj : అన్నదమ్ములు ఇద్దరూ ఒకేసారి పోస్టులు.. ఏంది బ్రో కండలు అలా పెంచారు ఇద్దరూ.. బ్యాక్ టు యాక్షన్..?

Manchu Manoj and Manchu Vishnu shares Photos in Social Media on same time

Updated On : April 22, 2024 / 11:59 AM IST

Manchu Vishnu – Manchu Manoj : మంచు మనోజ్, మంచు విష్ణు ఇటీవల కొన్నాళ్ళు సినిమాలకు గ్యాప్ ఇచ్చిన సంగతి తెలిసిందే. మనోజ్ అయితే చాలా రోజులు గ్యాప్ ఇచ్చాడు. ప్రస్తుతం మంచు విష్ణు కన్నప్ప సినిమాతో బిజీగా ఉన్నాడు. మనోజ్ ఇటీవల ఒక ఓటీటీ షోతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. త్వరలో వాట్ ది ఫిష్ అనే సినిమాతో రాబోతున్నాడు. ఇటీవలే మనోజ్ తండ్రి కూడా అయ్యాడు.

తాజాగా అన్నదమ్ములు మనోజ్, విష్ణు.. ఇద్దరూ ఆల్మోస్ట్ ఒకే టైంకి తమ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. మంచు మనోజ్ షూటింగ్ సెట్ లో తన ఫోటోని షేర్ చేస్తూ.. షూటింగ్ సెట్ లోకి వచ్చినందుకు చాలా హ్యాపీగా అంది. నాకు ఇష్టమైన ప్లేస్ అంటూ పోస్ట్ చేసాడు. అలాగే మంచు విష్ణు కూడా తన ఫోటోని షేర్ చేస్తూ.. తక్కువ మాట్లాడండి, ఎక్కువ చేయండి అంటూ పోస్ట్ చేసాడు. విష్ణు కూడా కన్నప్ప షూట్ లో బిజీగా ఉన్నాడు.

Also Read : Hanuman : ‘హనుమాన్’ 100 రోజులు.. ఇంకా ఎన్ని సెంటర్స్‌లో ఆడుతుందో తెలుసా?

ఇలా అన్నదమ్ములు ఇద్దరూ ఒకేసారి తమ ఫొటోలు షేర్ చేసి పోస్ట్ చేయడంతో ఇవి వైరల్ గా మారాయి. ఈ ఫొటోల్లో అన్నదమ్ములు ఇద్దరూ తమ కండలు కనపడేలా పోజులు ఇవ్వడంతో కండలు బాగానే పెంచారు, బాడీ బాగా మెయింటైన్ చేస్తున్నారు అని కామెంట్స్ చేస్తున్నారు. మరి అన్నదమ్ములు ఇద్దరూ తమ రాబోయే సినిమాలతో ప్రేక్షకులని మెప్పించి మళ్ళీ ఫామ్ లోకి వస్తారేమో చూడాలి.